Friday, April 26, 2024

ఇదేందిరా నాయ‌నా – స్నానం చేస్తుంటే ఓట్ల గోల

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్ర‌చారాల‌ని ముమ్మ‌రం చేశాయి పార్టీలు. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఇంటింటి ప్ర‌చారం చేప‌ట్టాయి ప‌లు పార్టీలు. త‌మ‌కే ఓటు వేయాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. ఇక్క‌డే ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ వ్య‌క్తి స్నానం చేస్తుండ‌గా త‌మ‌కే ఓటు వేయాల‌ని కాన్పూర్ కి చెందిన బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర మైతాన్నీ కోర‌డం వైర‌ల్ గా మారింది. ఇంటి ఆరుబయట ఓ వ్య‌క్తి స్నానం చేస్తున్న స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన సురేంద్ర అతనితో అక్క‌డే మాట్లాడారు. ఎలాగున్నారు.. మీ గృహ‌ నిర్మాణ ప‌నులు పూర్తయ్యాయా అని అడిగారు. స్నానం చేస్తోన్న ఆ ఓట‌రు స‌బ్బు రుద్దుకుంటూనే బీజేపీ నేత‌కు స‌మాధానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు సంబంధించిన‌ ఫొటోను బీజేపీ ఎమ్మెల్యే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో స్వ‌యంగా పోస్ట్ చేశారు.

తాము అమ‌లు చేస్తోన్న‌ హౌసింగ్ స్కీమ్ కింద ఆ వ్య‌క్తి ఇంటిని నిర్మించుకున్నార‌ని, అందుకే ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి అభినందించాన‌ని చెప్పారు. ఉత్తరప్రదేశ్ స‌హా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌లైంది. బ‌హిరంగ ప్ర‌చారాల‌పై ఎన్నిక‌ల సంఘం తాత్కాలిక నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. క‌రోనా నేప‌థ్యంలో ఈసీ నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లోనే దీనిపై స‌మీక్ష జ‌రిపి త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనుంది. వ‌ర్చువ‌ల్ విధానంలో ప్ర‌చారం చేసుకునే విష‌యంపై ప్ర‌ధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. స్నానం చేస్తోంటే ఓటు అడ‌గ‌డం ఏంటీ అని నిల‌దీస్తున్నారు. ఓటు అడ‌గేందుకు స‌మ‌యం, సంద‌ర్భం లేదా అని ప‌లువురు ప్రశ్నిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement