Saturday, April 27, 2024

TS: హలాల్​, హిజాబ్​, మునావర్​ ఇవేనా సమస్యలు?.. ఇష్యూస్​ని డైవర్ట్​ చేసేందుకే బీజేపీ కుట్రలు: కేటీఆర్​

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీడీపీ (గ్యాస్, డీజిల్ మరియు పెట్రోలు) పెరుగుదల వంటి బర్నింగ్ సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడమే బీజేపీ ప్రణాళిక అన్నారు. అందులో భాగంగానే హలాల్, హిజాబ్, మునావర్ ఫరూకీ వంటి అంశాలను లేవనెత్తుతున్నారని విమర్శించారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (బీఆర్‌ఏఓయూ)లో ఉద్యోగ ఔత్సాహికుల కోసం విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ప్రారంభించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమస్య తనకు అర్థం కాలేదని, దేవుడు తన పేరుతో మనలో మనమే పోట్లాడుకోవాలని కోరారా? కృష్ణుడు, రాముడు, జీసస్ లేదా అల్లా ఇట్లా గొడవలు పెట్టుకోవాలని అడిగారా? ‘ఎవరి దేవుడు గొప్ప’ అని మనం పోట్లాడుకోవడానికి ఆయన ఏదైనా పోటీ పెట్టారా? అని మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో పాటు ప్రయాణం ప్రారంభించిన చైనా 16 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణానికి చేరుకుందని, అయితే భారతదేశం ఇప్పటికీ 3.1 ట్రిలియన్ల వద్ద ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఎదుగుదలకు కృషి చేస్తోందని.. ‘ఎవరి దేవుడో గొప్ప’ వంటి ‘వెర్రి పనులకు’ దూరంగా ఉంటోందని మంత్రి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement