Wednesday, May 15, 2024

హీరోగా మార‌నున్న వెబ్ సిరీస్ యాక్ట‌ర్ ‘చైత‌న్య‌రావు’

వెబ్ సిరీస్ తో పాపుల‌ర్ అయ్యాడు చైత‌న్య‌రావు. దాంతో అత‌నికి యూత్, ఆడియెన్స్ లో క్రేజ్ కూడా పెరిగింది. ఆ ఫేమ్ తో హీరోగా మార‌నున్నాడు. గతేడాది య్యూటూబ్ ను షేక్ చేసిన వెబ్ సిరీస్ లలో ‘30 వెడ్స్ 21’ ఒకటి. ఈ తెలుగు వెబ్ సిరీస్ య్యూటూబ్ లో ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ప్రేక్షకులు ఈ సిరీస్ ఎపిసోడ్స్ ను మిలియన్ల వ్యూస్ తో విజయవంతం చేయడం విశేషం. చైతన్యకు హీరోగా బంపర్ ఆఫర్ అని చెప్పాలి. బుల్లితెరపై అలరించిన చైతన్య బిగ్ స్క్రీన్ పై ఎలా ఆకట్టుకోనున్నాడో వేచి చూడాల్సిందే.. పెళ్లి చూపులు, దొరసాని వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించిన బిగ్‌బెన్‌ సినిమాస్ పతాకంపై ఓ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైరన్ రాబోతోంది. ఈ మూవీలోనే చైతన్య రావును హీరోగా ఆడియెన్స్ ను అలరించనున్నాడు. నిర్మాత యశ్ రంగినేని చిత్రాన్ని నిర్మిస్తుండగా ‘పిట్ట కథ’ మూవీ డైరెక్టర్‌ చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే విషయాన్ని బిగ్ బెన్ సినిమాస్ ట్విట్టర్ ఖాతాలో అఫిషియల్ అనౌన్స్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement