Saturday, April 27, 2024

పార్టీ మూడ్ లో భీమ్లా నాయ‌క్ టీం – వైర‌ల్ గా ఫొటోలు

భీమ్లానాయ‌క్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లో ఓ రేంజ్ లో నిలుస్తుంద‌ని ప్ర‌శంసిస్తున్నారు సినీ జ‌నాలు. కాగా ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని అందుకోవ‌డంతో విజయోత్సవ ప్రెస్ మీట్ నిర్వహించిన భీమ్లా నాయక్ చిత్ర బృందం.. ఆ త‌ర్వాత గ్రాండ్ గా పార్టీ చేసుకుంద‌ట‌. ఈ పార్టీని పవన్ కల్యాణ్, ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విరివిగా దర్శనమిస్తున్నాయి. పవన్, త్రివిక్రమ్, తమన్ సహా భీమ్లా నాయక్ టీమ్ కు పనిచేసినవాళ్లందరూ ఈ పార్టీలో దర్శనమిచ్చారు. కాగా, పవన్ కారు దిగి రాగా, బాణసంచాతో స్వాగతం పలికారు. పవన్ ను త్రివిక్రమ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement