Friday, May 3, 2024

బ‌ప్పీల‌హ‌రి మ‌ర‌ణం క‌లిచివేసింది – హీరో చిరంజీవి

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పీల‌హ‌రి మ‌ర‌ణంపై సంతాపాన్ని వ్య‌క్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. సుప్ర‌సిద్ధ సంగీత ద‌ర్శ‌కులు బ‌ప్పి ల‌హిరి మృతికి చిరంజీవి సంతాపం… బ‌ప్పి ల‌హిరి కన్నుమూత తీవ్ర ఆవేదనను కలిగించిందన్న చిరంజీవి… తన సినిమాలకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి సూపర్ హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకుంటూ, ఆయన లేని లోటు తీర్చలేదనిదని’ ట్విట్ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బప్పిలహరి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించారు. పశ్చిమ బెంగాల్ జల్పాయ్ గుడిలో జన్మించిన ఆయన హిందీ, తెలుగు, గుజరాతీ, కన్నడతో పాటు పలు భాషల్లోని సినిమాలకు సంగీతాన్ని అందించారు. తెలుగులోనూ చాలా సినిమాలకు సంగీతాన్ని అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement