Wednesday, May 15, 2024

బండి క‌స్ట‌డీకి పిటిష‌న్ – విచార‌ణ కోసం ఈట‌ల‌కు నోటిస్

క‌రీంన‌గ‌ర్ – టెన్త్ పేప‌ర్ లీకేజ్ కేసులో నేడు జ‌రిగే ప‌రిణామాల‌లో అంద‌రిలోనూ ఉత్కంఠ పెరిగిపోతున్న‌ది.. త‌న‌కు బెయిల్ మంజూరు చేయ‌వ‌ల‌సింది హ‌న్మ‌కొండ కోర్టులో బండి సంజ‌య్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా, విచార‌ణ కోసం త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాలంటూ వ‌రంగ‌ల్ పోలీసుల అదే కోర్టు పిటిష‌న్ వేశారు.. ఇది ఇలా ఉంటే బండి సంజయ్‌ రిమాండ్‌ని కొట్టివేయాలంటూ హైకోర్ట్‌లో బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో దాఖ‌లు చేసిన‌ లంచ్ మోషన్ పిటిషన్ విచార‌ణ కూడా నేడు జ‌ర‌గ‌నుంది… కాగా,బండి సంజయ్‌ మొబైల్‌ ఫోన్ ఇవ్వలేదని ఫోన్ డేటాతో పాటు లీకేజ్‌ కేసులో లోతుగా విచారించాలని.. కస్టడీ పిటిషన్‌లో వేర్వేరు అంశాల్ని పోలీసులు ప్రస్తావించారు. అలాగే బండి సంజయ్‌, ప్రశాంత్‌ను వారంపాటు పోలీసులు కస్టడీ కోరనున్నారు.

ఇక ఈ కేసులో వ‌రంగ‌ల్ పోలీసులు వేగం పెంచారు.. కమలాపూర్‌లో పేపర్‌ లీక్‌పై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్టేట్‌మెంట్ ను వరంగల్ పోలీసులు రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యే ఈటలకు ప్రశాంత్ పేపర్‌ పంపడంతో ఈ విషయంలో పోలీసులు మరింత ఫోకస్ పెంచారు. పేపర్‌ లీక్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? అసలేం జరిగింది..? దీని వెనుక ఎవరున్నారు..? కోణాల్లో పోలీసులు ఆరా తీయనున్నారు. ఈ మేరకు వరంగల్ పోలీసులు ఈటల రాజేందర్, పీఏకు నోటీసులు ఇవ్వనున్నారు. వారి నుంచి మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టేంద‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.. అలాగే ప్ర‌శాంత్ వాట్స్ ప్ ద్వారా ప్ర‌శ్న‌ప‌త్రం చేరిన వారంద‌రిని కూడా ర్యాండ‌మ్ గా విచారించాల‌ని వ‌రంగ‌ల్ పోలీసులు నిర్ణ‌యించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement