Tuesday, May 7, 2024

Big Story | బాహుబలికా బాప్ మోటార్స్‌, అతిపెద్ద లిఫ్టింగ్​ కెపాసిటీ.. మరో చరిత్రకు ‘పాలమూరు’ సాక్ష్యం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సాగునీటి రంగంలో చరిత్ర సృష్టించడం, సృష్టించిన చరిత్ర అధిగమించడం తెలంగాణకే సాధ్యం. దేశచరిత్రలో కాళేశ్వరం అద్భుతాలను ఆవిష్కరిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆచరిత్ర శిఖరాగ్రంలో నిలిచి ఆసియాలోనే అద్భుత ప్రాజెక్టుగా రికార్డులను సొంతం చేసుకోనుంది. భూగర్భంలో సుమారు పావు కిలో మీటరు పొడవులో పంపుహౌజ్‌ నిర్మాణ స్టేషన్లు, పాతాళం లోకి చొచ్చుకుని పోయిన సర్జిఫూల్‌ కొండలను సరిహద్దులుగా చేసుకుని భూగర్భం నుంచి ఈదుతూ ప్రయాణించే జలవనరుల చరిత్రకు పాలమూరు ప్రత్యేక్షంగా నిలవనుంది. కాళేశ్వరంలో 139 మెగావాట్ల సామర్ధ్యం మోటార్లు బిగించి చరిత్రలోనిలిచిన ఇంజనీరింగ్‌ నైపుణ్యతకు మరింత మెరుగులు దిద్ది 145 మెగావాట్ల మోటార్లును బిగించి ఆసియాలో ఖండంలోనే అద్భుత ప్రాజెక్టుగా నిలిచిపోయింది.

ఈ మోటార్ల అశ్వక శక్తి 1,94,445 ఉండగా 10వేల 444 గజ బలంతో సమానం గా నిలిచిపోయింది. ఒకసెకనుకు 3వేల ఘనపు అడుగుల నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా ఇంజనీరింగ్‌ నిపుణులు చెపుతున్నారు. బృహత్‌ నిర్మాణాల వేదికగా భాసిల్లుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్జి ఫూల్‌ నిర్మాణాలు ఆధునిక ఇంజనీరింగ్‌ నైపుణ్యతకు తార్కాణాలు. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంపు హౌజ్‌ సర్జ్‌ ఫూల్‌ పెద్దదిగా చరిత్రలో నిలిచింది. ఈసర్జ్‌ పూల్‌ 350 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 54 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే అంతకు మించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లోభాగంగా నిర్మిస్తున్న ఏదుల పంప్‌ హౌజ్‌ సర్జి ఫూల్‌ 357 మీటర్ల పొడవు, 30మీటర్ల వెడల్పు, 90 మీటర్ల ఎత్తు ఉండటం గమనార్హం.

- Advertisement -

ఈ పంపు హౌజ్‌ సముద్ర మట్టానికి 274 మీటర్ల ఎత్తులోంచి 341 మీటర్ల నుంచి చివరికి చేరుకునే సరికి 674 మీటర్ల ఎత్తులోకి నీటిని ఎత్తి పోయడం ప్రత్యేకత.అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నార్లాపూర్‌ ప్రాజెక్టు వెట్‌ రన్‌ కు సిద్ధంకాగా ఉద్దండాపూర్‌ కరివెన జలాశయాల్ల పనులు వేగవంతం అయ్యాయి, ఈ ప్రాజెక్టులో 61.51 కిలోమీటర్లు నల్లమల అడవుల్లోని భూగర్భంనుంచి నిర్మించిన సొరంగాలు ఉండగా మొత్తం కాలువల పొడవు 915 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. 400 కేవీ. విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి.

నార్లాపూర్‌ పంపు హౌజ్‌ నుంచి గ్రావిటీ, టన్నెల్‌ ద్వారా నీటిని తరలిస్తారు. కొల్లాపూర్‌ మండలం కోతి గుండు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి కృష్ణా జలాలను దశలవారిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తరలించడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.ఈ నీటిలో వ్యవసాయానికి 75.94 టీఎంసీ, పరిశ్రమలకు 37 టీఎంసీ, తాగునీటి అవసరాలకు 7.15 టీఎంసీ నీటిని వినియోగించనున్నారు.

వలస బతుకుల్లో వెలుగులు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈఎన్సీ అహ్మద్‌ ఖాన్‌
వందలాది మంది ఇంజనీర్లు, వేలాది మంది కార్మికులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ అహ్మద్‌ ఖాన్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టుతో పాలమూరు వలస బతుల్లో వెలుగులు వస్తాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలమేరకు, సాగునీటి పారుదల శాఖ సూచనలతో పనులు వేగం పుంజుకున్నాయని అహ్మద్‌ ఖాన్‌ తెెలిపారు. భూగర్భ పంపు హౌజ్‌ ల నిర్మాణాలతో భారీ సర్జ్‌ ఫూల్‌, మహాబాహుబలి పంపుల బిగింపు పూర్తి కావచ్చాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం ఓచరిత్ర సృష్టిస్తోందన్నారు. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నీటిని ఎత్తి పోయగానే 18. 3 కి.మీ. కాలువ ద్వారా 15 కిలోమీటర్లు భూగర్బ సొరంగంద్వారా ప్రయాణిస్తాయని చెప్పారు. అనంతరం ఏదుల పంపు హౌజ్‌ చేరుకుని అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌ కు చేరుకుంటాయని ఆహ్మద్‌ ఖాన్‌ వివరించారు.ఏదుల రిజర్వాయర్‌ నుంచి 19 కిలోమీటర్లు టన్నెల్‌ ద్వారా ప్రయాణించి వట్టెం పంపు హౌజ్‌ చేరుకుంటాయన్నారు. వట్టెంపంపు హౌజ్‌ నుంచి వట్టెం రిజర్వాయర్‌ చేరుకుని ప్రవాహ వేగం ద్వారా 12 కిలో మీటర్లు ప్రయాణించి కరివెన రిజర్వాయర్‌ కు కృష్ణా జలాలు ప్రవహిస్తాయని అహ్మద్‌ ఖాన్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement