Monday, April 29, 2024

AP | శ్రీవారిమెట్టు వద్ద కూడా భక్తులకు కర్రలు ఇస్తాం: భూమన

చంద్రగిరి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): ఆలిపిరి వద్ద ఇస్తున్నట్టుగానే శ్రీవారి మెట్టు నడకమార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు కూడా త్వరలో కర్రలను ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఇక్కడికి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఈనెల 11 వరకు జరిగే మహాశాంతి వరుణయాగంలో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) ఆచార్య రుత్విక్ వరణం జరిగింది. టీటీడీ ఛైర్మన్, ఈవో ఏవి.ధర్మారెడ్డి క‌లిసి అర్చకులకు పసుపు వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్బంగా కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలందరికీ మంచి జరగాల‌నే సత్సంకల్పంతో శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం తలపెట్టామ‌ని చెప్పారు.

నెల క్రితం తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలో నిర్వహించిన వరుణయాగం వల్ల వర్షాలు బాగా కురిశాయ‌న్నారు. ఈ సంవత్సరంతో పాటు, వచ్చే సంవత్సరం కూడా తక్కువ వర్షపాతం నమోదవు నెల క్రితం తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలో నిర్వహించిన వరుణయాగం వల్ల వర్షాలు బాగా కురిశాయ‌న్నారు. ఈ సంవత్సరంతో పాటు, వచ్చే సంవత్సరం కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ నిపుణుల సూచ‌న‌ల నేపథ్యంలో ప్రజల క్షేమం కోసం, వారికి సౌభాగ్యం క‌ల‌గాల‌ని కోరుకుంటూ టీటీడీ ఈ యాగాన్ని నిర్వహిస్తోందని వివరించారుతుందన్న వాతావరణ నిపుణుల సూచ‌న‌ల నేపథ్యంలో ప్రజల క్షేమం కోసం, వారికి సౌభాగ్యం క‌ల‌గాల‌ని కోరుకుంటూ టీటీడీ ఈ యాగాన్ని నిర్వహిస్తోందని వివరించారు

గతంలో ఎన్నడూ ఈ త‌రహాలో యాగం జరగలేదని తెలిపారు. మూడు రాష్ట్రాల నుంచి అర్చకులు, దాదాపు 60 మందికి పైగా వైఖానస ప్రముఖులు, 30 మందికి పైగా వేద పండితులు, 215 మందికి పైగా రుత్వికులు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారని వివ‌రించారు. ఈ యాగం వల్ల పరిపూర్ణంగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అలిపిరి నడకదారిన వెళ్లే భక్తులకు కర్రలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభినట్టే, త్వరలో చంద్రగిరి సమీపంలోని శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు చేతికర్రలు ఇస్తామ‌ని తెలిపారు. కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement