Thursday, May 2, 2024

నారాయణపేట జిల్లాలో దారుణం.. ఆ పనికి ఒప్పుకోలేదని నిప్పంటించిన ఉన్మాది..

తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన జ‌రిగింది. లైంగిక దాడిని ప్రతిఘటించిన ఓ యువతిపై ఉన్నాది నిప్పటించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ యువతి చికిత్స పొందుతూ చ‌నిపోయింది. జిల్లాలోని మద్దూరు మండలానికి చెందిన యుతిపై కోయిల్ కొండ మండలం ఇంజమూర్ గ్రామానికి చెందిన వెంకట్రాములు నిన్న రాత్రి లైంగిక దాడికి యత్నించాడు. అయితే ఆ యువతి ప్రతిఘటించడంతో వెంకట్రాములు ఆమెకు నిప్పటించాడు. గాయాలతో అరుస్తున్న యువతినికి గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ఇవ్వాల చ‌నిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్దూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్​లోని ఉప్పరపల్లిలో పని చేసుకుంటూ జీవిస్తోంది. కోయిల్​కొండ మండలం వింజమూర్​కు చెందిన వెంకట్రాములు కూడా ఉప్పరపల్లిలోనే పనిచేస్తున్నాడు. కొంతకాలంగా యువతితో పరిచయం పెంచుకున్న వెంకట్రాములు.. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని హైదరాబాద్ నుంచి మద్దూర్​కు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి రావడంతో.. వెంకట్రాములు ఆమెపై లైంగిక దాడి చేసి, వదిలేయాలని చూశాడు. అయితే యువతి ప్రతిఘటించడంతో కోపంతో ఆమెపై వెంకట్రాములు పెట్రోల్ పోసి నిప్ప‌టించిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement