Saturday, April 27, 2024

India: రాహుల్​ రావాలి, అధ్యక్షుడు కావాలి.. కాంగ్రెస్​ పార్టీలో దేశవ్యాప్త తీర్మానాలు

కాంగ్రెస్​ అగ్రనేత, ఎంపీ రాహుల్​ గాంధీని పార్టీ అధ్యక్షుడిని చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఎనిమిది రాష్ట్ర యూనిట్లు దీనిపై ఇప్పటికే తీర్మానాలు చేయడంతో రాహుల్ గాంధీని కాంగ్రెస్ చీఫ్‌గా చేయాలనే నినాదం మరోసారి తీవ్రం అవుతోంది. కాగా, రాహుల్​ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించనప్పటికీ పార్టీ శ్రేణులు మళ్లీ అతడినే అధ్యక్షుడిగా చేయాలని కోరుతున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్​ పార్టీకి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై దేశ ప్రజల దృష్టి మరోసారి నిలిచింది. తాను భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నానని చెబుతున్నప్పటికీ, పోస్టర్లు, బ్యానర్లు, నినాదాలు ఆయన యాత్రకు భిన్నమైన స్టోరీని చెబుతున్నాయి. ఒక పోస్టర్‌లో “మా ప్రియతమ నాయకుడు,” మరొకటి “ప్రజల ప్రధాని” అని రాసి ఉండగా.. వాటిలో ప్రధానంగా రాహుల్ గాంధీ ఫొటోలు హైలైట్​గా నిలుస్తున్నాయి.

పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీ చుట్టూ పెద్ద ఎత్తున చేరుతున్నారు. భారత్ జోడో యాత్రకు భారీగా హాజరైన పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ పరీక్ష సమయాల్లో కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ మాత్రమే నడిపించగలరనే భావన పార్టీలో ఏర్పడుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ “పార్టీ కీలక సంధి సమయంలో ఉంది. పార్టీ మొత్తానికి ఏకగ్రీవ అభిప్రాయం ఉన్న ఒకే ఒక్క పేరు – ఒక విధమైన ఏకాభిప్రాయ అభ్యర్థి- రాహుల్ గాంధీ. మరెవరైనా పోటీ చేస్తే, బ్యాడ్​ రిజల్ట్స్​ వస్తాయి. G-23 తన అభ్యర్థిని నిలబెడుతుంది. బిజెపితో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశాన్ని పొందుతాయి.”అన్నారు.

కాగా, రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటారని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల విషయానికొస్తే రాహుల్ గాంధీ ఇంతవరకు ప్రకటించలేదు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, రాష్ట్రం తీర్మానం ఆమోదించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ “ఇది 2 రాష్ట్రాల్లో జరిగింది, అయితే ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ ప్రతిపాదన వస్తే, రాహుల్ జీ ఈ విషయంలో పునరాలోచించాలి. రాహుల్జీ పార్టీ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోండి.

- Advertisement -

ఇక.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “రాహుల్ గాంధీ పార్టీ శ్రేణుల గుర్తింపు పొందిన నాయకుడు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ సెప్టెంబరు 24 నుండి ప్రారంభమవుతుంది. ఒకే అభ్యర్థి ఉంటే అక్టోబర్ 2 నాటికి కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటాం అన్నారు.

పలు రాష్ట్రాల్లో తీర్మానాలు:

రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈ చర్చ దేశమంతా ప్రారంభమైంది. చత్తీస్‌గఢ్, బీహార్, జమ్మూ & కాశ్మీర్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలు కూడా ఇదే విధమైన తీర్మానాలు చేశాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి.  అందులో “మేము (రాష్ట్ర యూనిట్) పీసీసీ, ఏఐసీసీ సభ్యులను నియమించడానికి – రాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడికి- అధికారం ఇస్తున్నాము” అని పేర్కొన్నారు.

ఇక.. ఏఐసీసీ తెలంగాణ ఇన్​చార్జి, మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్‌లో ఇలా రాశారు “మా @INCTamilNadu అధ్యక్షుడు అన్నన్ @KS_Alagiri కొత్తగా ఎన్నికైన PCC జనరల్ బాడీ మీటింగ్‌లో “కాంగ్రెస్ అధ్యక్షుని బాధ్యతను స్వీకరించాల్సిందిగా తమిళనాడు కాంగ్రెస్ PCC తిరు @RahulGandhiని అభ్యర్థించడం” గురించి ప్రత్యేక తీర్మానం చేయడం చూసి సంతోషిస్తున్నాము. అందరూ దీనికి మద్దతు ఇచ్చారు ” అని రాశారు.

కాగా, తెలంగాణ, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని కాంగ్రెస్ ఇతర రాష్ట్ర యూనిట్లు కూడా రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి తీర్మానాలను ఆమోదించాలని చర్చిస్తున్నాయి. మంగళవారం రాంచీలో జార్ఖండ్ కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా చేయాలనే తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు జేపీ అగర్వాల్, అవినాష్ పాండే, దీపేందర్ హుడా, శశిథరూర్ సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement