Friday, May 3, 2024

ఆక‌ట్టుకుంటున్న ‘అర్జున ఫ‌ల్గుణ’ ట్రైల‌ర్

తేజ మార‌ని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం అర్జున ఫ‌ల్గుణ‌. ఈ చిత్రంలో హీరోగా శ్రీ విష్ణు న‌టించాడు. హీరోయిన్ గా అమృత అయ్య‌ర్ న‌టించింది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 31న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ లో హీరో, అత‌ని ఫ్రెండ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా క‌నిపిస్తున్నారు. అంతేకాదు వాళ్ళ పేర్లు కూడా ఆది .. సింహాద్రి .. రాఖీ .. యమదొంగ అని పెట్టుకుంటారు. “అరకు వెళ్లి అక్కడ నా పేరు చెప్పు .. అక్కడ నీకు ఒక మూట ఇస్తారు” అని చెప్పడాన్ని బట్టి, ఇది గంజాయి స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథగా కనిపిస్తోంది.

పల్లెటూళ్లో పాలమ్ముకుని బ్రతికే హీరో వెంట పోలీసులు పడటానికి కారణం అదేనని అనిపిస్తోంది. ‘గంగిగోవు పాలు పావు లీటరు చాలు .. ” .. ” ఇంకా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావురా నువ్వు” అని తండ్రి అంటే, అందుకు సమాధానంగా హీరో “డిగ్రీ దాకా చదివాను .. ఒక ఆరు నెలలు రెస్టు తీసుకుంటే తప్పా” అనడం వంటి డైలాగ్స్ బాగున్నాయి. లవ్ ట్రాక్ ను టచ్ చేస్తూ సాగే ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మ‌రి ఈ చిత్రం శ్రీవిష్ణుకి ఏ మేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement