Monday, April 29, 2024

కరోనా వ్యాక్సిన్‌.. ప్రభుత్వాలకు విరాళాల వెల్లువ!

కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి దేశ వ్యాప్తంగా జోరుగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తామని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రపదేశ్, కేరళ కూడా ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తమ వంతు సాయం అందిస్తున్నారు ప్రజలు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీకాల కొనుగోలు కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలిస్తున్నారు.

కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 1 నుండి  18-45 సంవత్సరాల మధ్య వారికీ ఉచిత వాక్సిన్ పథకానికి శ్రీకారం చూట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహయనిధికి భారీగా విరాళం అందుతోంది. ఇప్పటికే పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతుగా చేయూతనిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1,33,34,844 అందించాయి. తాజాగా వైససీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి  20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.

మరోవైపు 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీళ్లందరికీ ఏపీ సర్కార్‌ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది. ఈ మేరకు భారత్ బయోటెక్, హెటెరో ఎండీలకు సీఎం జగన్ ఫోన్ చేసి కొవాగ్జిన్ వ్యాక్సిన్, రెమిడెసివివర్ ఇంజెక్షన్ వయల్స్‌ను భారీ సంఖ్యలో పంపాలని కోరారు.

మరోవైపు కరోనా నియంత్రణలో కేరళ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారు. వ్యాక్సిన్‌ లను ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే వేలాది మంది కేరళీయులు తమ ప్రభుత్వానికి చేయూతనందించడానికి రెడీ అయ్యారు. వ్యాక్సిన్‌ను కొనేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఉదారంగా విరాళాలు అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఆదాయం తగ్గడంతో ప్రజలు స్పందిస్తున్నారు. విరాళాలు ఇచ్చిన వారు తమ సర్టిఫికెట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. మిగిలినవారు కూడా ఉత్సాహంగా ప్రభుత్వానికి సాయపడుతున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి సంక్షోభాన్నిఎదుర్కొనడానికైనా ప్రజల మద్దతే తమకు బలమని కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ చెప్పారు. ప్రజలకు ఉచితంగా టీకా వేస్తామని చెప్పామని, అందుకు బదులుగా ప్రజలకు కూడా తమకు సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ అండతో కరోనా సంక్షోభం నుంచి మేం త్వరలోనే బయటపడతామని విశ్వాసం వ్యక్తం చేశారు. 


Advertisement

తాజా వార్తలు

Advertisement