Thursday, May 2, 2024

తెలంగాణ బ‌డ్జెట్ లో కేటాయింపులు ఇవే-దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి

ఆర్థిక‌శాక మంత్రి హ‌రీశ్ రావు 2022-23 వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టారు.. రూ. 2.65 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 1,89,274.82 కోట్లుగా పేర్కొన్నారు. క్యాపిటల్ వ్యయం రూ. 29,728.44 కోట్లుగా ఉంది. రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేయనున్నారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేయనున్నట్టుగా మంత్రి హరీష్ రావు తెలిపారు.

బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే..

రాష్ట్ర బడ్జెట్ – రూ. 2,56,958 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 1,89,274.82 కోట్లు
క్యాపిటల్ వ్యయం – రూ. 29,728.44 కోట్లు
దళితబంధుకు – రూ. 17,700 కోట్లు
దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి. అతి పెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు రికార్డు సృష్టించింది.
పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
రూ. 75 వేల లోపు పంట రుణాల మాఫీ
రూ. 50 వేల లోపు రైతు రుణాలు ఈ నెల చివరిలోపు మాఫీ
ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 177 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 2,750 కోట్లు
ఆసరా పింఛన్ కోసం రూ. 11,728 కోట్లు
డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు రూ. 12,000 కోట్లు
మన ఊరు – మన బడి కార్యక్రమానికి రూ. 7,289 కోట్లు
హరితహారం పథకానికి రూ. 932 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ. 1,542 కోట్లు
పామాయిల్ సాగుకు రూ. 1,000 కోట్లు
తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు. కొత్త మెడికల్ కాలేజీలకు రూ. 1,000 కోట్లు. రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement