Wednesday, May 8, 2024

నటుడు సోనూసూద్‌ పై కేసు నమోదు

ప్రముఖ నటుడు సోనూసూద్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్‌లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు నటుడు సోనూ సూద్‌పై అభియోగాలు మోపారు. ఐపీసీ సెక్షన్‌ 188 కింద ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేశారు. మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు నటుడు సోనూసూద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగానే మోగా నియోజకవర్గం నుంచి నటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ పోటీ చేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించకుండా అధికారులు ఆదివారం(ఫిబ్రవరి 20) సోనూసూద్‌ ను అడ్డుకున్నారు. అంతేకాదు, సోనూసూద్‌ కు చెందిన కార్లు, కూడా సీజ్‌ చేశారు. కాగా, మొత్తం 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం పోలింగ్ జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement