Thursday, May 16, 2024

సినిమాల్లో న‌టించిన మంత్రి అంబ‌టి రాంబాబు – వైర‌ల్ గా ఫొటో

ఏపీ కొత్త కేబినెట్ లో అంబ‌టి రాంబాబు కొత్త కేబినెట్ లో కీలకమైన ‘భారీ నీటిపారుదల శాఖ’ దక్కింది. తన మాటల తూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆయనలో మరో యాంగిల్ కూడా ఉంది. గతంలో సినీ ఇండస్ట్రీతో రాంబాబుకు అవినాభావ సంబంధం ఉందనే విషయం తాజాగా లీక్ అయ్యింది. ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన అంబటి రాంబాబు గతంలో సినిమాల్లో నాటకాల్లో నటించార‌ట‌. ఈ మేరకు ఆయన ఓ సినిమాలో నటించినట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంబటి రాంబాబు యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ సినిమాలో నటించినట్లు ఫొటోల్లో స్పష్టమవుతోంది. రాంబాబు నటించింది ఏ సినిమాలో అయితే తెలియదు కానీ.. బీచ్ వ‌ద్ద ఒక గుడిసెలో ఉండే ఒక పేద వ్యక్తి పాత్రలో ఒదిగిపోయినట్టు తెలుస్తోంది. అంబటి పక్కన హీరోయిన్ ఉండడంతో ఇది మెయిన్ రోల్ పాత్ర అని తెలుస్తోంది. సినిమా ఏంటి? డైరెక్టర్ ఎవరన్నది మాత్రం తెలియదు. రాంబాబు ఏ సినిమాలో నటించాడన్నది తెలియాల్సి ఉంది. ఈ ఫొటోలు చూస్తే మాత్రం దాదాపు 30 ఏళ్ల క్రితం వాటివిగా అనిపిస్తోంది. అందులో యంగ్ రాంబాబు అచ్చం సినిమా హీరోను తలపించేలా అందంగా ఉన్నారు. దీంతో రాంబాబు హీరో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement