Saturday, April 27, 2024

Acharya: ‘ఆచార్య’ రిలీజ్ వాయిదా.. మెగా అభిమానులకు నిరాశ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ ‘ఆచార్య’ వాయిదా పడింది. రామ్ చరణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే, కాజల్ హీరోయిన్లు నటించారు. ఆచార్య సినిమాను ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే,తాజాగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. కరోనా మ‌హమ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఆచార్య సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం అని తెలిపారు.

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో సంక్రాంతి బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి ప‌లు పెద్ద సినిమాల విడుద‌ల వాయిదా ప‌డ‌డంతో సినీ అభిమానులు నిరాశ చెందారు. ఇప్పుడీ జాబితాలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా చేరింది. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

మరోవైపు ఈ సంక్రాంతికి పెద్ద  సినిమాలు లేకపోవడంతో థియేటర్ల వద్ద పండగ సందడి అంతగా కనిపించడం లేదు. నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా నిన్న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. అలాగే, భారీ సినిమాలు రేస్ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం చిన్న సినిమాలు విడుదల అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement