Tuesday, May 7, 2024

రోడ్డుపైకి దూసుకొచ్చిన బండరాళ్లు

హిమాచల్‌ప్రదేశ్ లో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. కిన్నౌర్ జిల్లాలో కొండ చరియలు విరిగి.. పెద్ద పెద్ద బండరాళ్లు కింద పడుతున్నాయి. అవి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఢీకొన్నాయి. దీంతో కొన్ని వాహనాలు కొండచరియల కింద చిక్కుకుపోయాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు. బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కిన్నౌర్‌లోని రెకాంగ్ పియో-సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై వెళ్తున్న ఓ హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సుతో పాటు లారీని బలంగా ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద 40 మంది వరకు చిక్కుకున్నట్లు చెప్పారు. కొండలపై నుంచి పెద్ద పెద్ద రాళ్లు దూసుకొచ్చి, హైవేపై పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది చదవండి: హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్

Advertisement

తాజా వార్తలు

Advertisement