Saturday, April 27, 2024

పెళ్లి సందD టైటిల్ సాంగ్ విడుదల రేపే

రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెళ్లి సందడి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పెళ్లి సందD సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తుండగా…శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాకు రాఘవేంద్రరావు స్వీయ దర్శకత్వం వహిస్తుండగా… గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా… మరో పాటను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు యూనిట్. ఈ చిత్రం టైటిల్ సాంగ్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement