Wednesday, May 8, 2024

మీ సేవ‌లు స్ఫూర్తిదాయ‌కం.. హాపీ బ‌ర్త్ డే బాల‌య్య సార్.. యువ‌రాజ్ సింగ్

మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా హీరో బాల‌కృష్ణ‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ సార్. క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజానికి అంకిత భావంతో మీరు చేస్తున్న సేవలు స్పూర్తిదాయకం. మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. అలాగే గతంలో బాలయ్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇదిలా ఉంటే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‏స్టిట్యూట్ చైర్మన్ గా ఉంటూ బాలకృష్ణ అనేక సేవలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఇక క్రికెటర్ యువరాజ్ సింగ్ 2011లో క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుని పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు. అప్పటినుంచి ఓ ఫౌండేషన్ స్టార్ట్ చేసి క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నారు. అదే సమయంలో యూవీ బసవతారకం ఆసుపత్రికి అవసరం సమయంలో సాయం చేస్తున్నారు. ఇలా వీరిద్దరి మంచి సన్నిహిత్యం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement