Friday, May 3, 2024

ధోని సన్యాసి వేషం సీక్రెట్ రివీల్..

మహేంద్ర సింగ్ ధోనీ ఓ క్రికెట్ దిగ్గజం. ధోని సడెన్ గా సన్యాసి వేషంలో కనిపించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీని బౌద్ధ భిక్షువు తరహాలో చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. ధోని ఎందుకు సన్యాసి గెటప్ వేసుకున్నాడని అందరూ ఆలోచించారు. ధోనీ గెటప్పు వెనుక అసలు కథేంటో ఇప్పుడు వెల్లడైంది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ షురూ అవుతున్న నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్, టోర్నీ స్పాన్సర్ వివో, ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రోమో వీడియో రూపొందించాయి.

ఇక ప్రోమోలో ఐపీఎల్ విశిష్టతను, రోహిత్ శర్మ వంటి అత్యధిక ఐపీఎల్ టోర్నీ విజయాలు అందుకున్న కెప్టెన్ గురించి సన్యాసి వేషంలో ఉన్న ధోనీ… తన శిష్యులకు వివరించడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement