Thursday, May 9, 2024

Team India | ఈ ఏడాది అత్యధింకంగా టీ20లే ఆడనున్న టీమిండియా !

కొత్త సంవ‌త్స‌రం ప్రారంభ‌మైంది. ఈ ఏడాది ఎన్నో ప్రతిష్టాత్మక క్రీడలకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ విషయానికి వస్తే.. టీ20 ప్రపంచకప్ కూడా ఈ ఏడాదే జరగనుంది. ఇక భారత పురుషుల జట్టు కూడా ఈ సంవత్సరంలో అత్యధికంగా టీ20 మ్యాచ్‌లే ఆడనుంది. టెస్టు మ్యాచులు సైతం ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా బీసీసీఐ మ్యాచ్ షెడ్యూల్ చేసింది. అయితే మొత్తంగా 2024లో టీమిండియా కేవలం 3 వన్డే మ్యాచులు మాత్రమే ఆడనుంది. మరి ఈ కొత్త ఏడాదిలో టీమిండియా ఎన్ని మ్యాచులు ఆడబోతుంది.. వాటి షెడ్యూల్ ఏంటో చూద్దాం..

టీమిండియా 2024 క్రికెట్ షెడ్యూల్..

ప్రపంచం మొత్తం 2023కు వీడ్కోలు పలికి.. 2024కు స్వాగతం పలికింది. గత ఏడాది తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేసి.. మధుర క్షణాలను మోసుకుంటూ ప్రపంచం

2024లోకి అడుగుపెట్టిన టీమిండియా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో ప్రారంభించనుంది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా చివరిదైన రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచుతో దక్షిణాఫ్రికా పర్యటన ముగుస్తుంది. ఆ త‌రువాత‌ టీమిండియా అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ అడనుంది. జనవరి 11 నుంచి జనవరి 17 వరకు మూడు టీ20 మ్యాచులు జరుగుతాయి.

అనంతరం భారత్ వేదికగా ఇంగ్లాండ్‌తో 5 మ్యాచుల టెస్టు సిరీస్ లో తలపడనుంది. ఈ టెస్టు సిరీస్ జనవరి 25 నుంచి మార్చి 11 వరకు జరగనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ రావాల్సి ఉంది. మార్చి, ఏప్రిల్, మేలో ఈ లీగ్ జరగనుంది.

- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన స్వల్ప వ్యవధిలోనే వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. జూన్ 4 నుంచి జూన్ 30 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. జులైలో ఉండే ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచుల్లో టీమిండియా తలపడనుంది.

ఆ తర్వాత సెప్టెంబర్‌-అక్టోబర్‌లో భారత్ వేదికగా బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, 3 టీ20ల్లో తలపడుతుంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 టెస్టులు జరుగుతాయి. ఆ తర్వాత నవంబర్-డిసెంబర్ నెల్లలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. దీంతో టీమిండియా షెడ్యూల్ ముగుస్తుంది.

మొత్తంగా ఈ ఏడాదిలో టీమిండియా కేవలం 3 వన్డే మ్యాచులు మాత్రమే ఆడనుంది. ఎక్కువగా టీ20లు, టెస్టు మ్యాచుల్లో తలపడనుంది. 2024లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఎక్కువగా టీ20 మ్యాచులే ఆడేలా షెడ్యూల్ చేశారు. మొత్తంగా ఈ ఏడాదిలో టీమిండియా అన్ని నెలల్లోనూ ఏదో ఒక సిరీస్‌తో బిజీగా ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement