Monday, April 29, 2024

Almonds: బాదంపప్పుతో పండగ సీజన్‌ను హెల్తీగా మార్చుకోండి..

హైద‌రాబాద్ : బాదంపప్పులతో మీ పండుగ సీజన్ ను ఆరోగ్యవంతంగా మార్చుకోండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో సుమారు 101 మిలియన్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారని, మరో 136 మిలియన్ల మంది ప్రజలు ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారని అంచనా. ఈ పండుగ సీజన్‌లో మన ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సీజన్లో తెలివైన ఆహార ఎంపికలు చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి, సెలబ్రిటీ సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ… పండుగ సీజన్ లో స్వీట్లు, నాకు ఇష్టమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాను. కానీ ఆరోగ్యకరమైన ట్విస్ట్‌ను జోడించడానికి, బాదం తన మొదటి ఎంపిక అన్నారు. ఫిట్‌నెస్ అండ్ సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్, యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ.. పండుగ సీజన్‌ లో తమకు ఇష్టమైన స్వీట్‌లు, ఆహారాలను తీసుకోవచ్చు కానీ మితంగా తినాలన్నారు. ఏదో ఒక రకమైన వ్యాయామంతో తీసుకున్న కేలరీలు కరిగించాలన్నారు.

ఢిల్లీ మాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ… మనం తినే ఆహారంలో బాదం వంటి వస్తువులను చేర్చడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగు పడటానికి తోడ్పడుతుందన్నారు. ఆహారం నుండి శక్తిని విడుదల చేయడంలో ఇవి గుర్తింపు పొందిన పోషకాలన్నారు. న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… ఈ పండుగ సీజన్‌లో మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించండి, మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం మర్చిపోవద్దని అన్నారు.

ఇంటిగ్రేటివ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్, రోహిణి పాటిల్ మాట్లాడుతూ…బాదంపప్పు ను రోజువారీ తీసుకోవడం వల్ల రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ముడతల తీవ్రతను తగ్గించడంలో కూడా దోహదపడుతుందన్నారు. ప్రఖ్యాత కన్నడ నటి, ప్రణీత సుభాష్ మాట్లాడుతూ… బాదంపప్పు తినడం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఎందుకంటే అవి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయన్నారు. ప్రఖ్యాత భారతీయ చలనచిత్ర అండ్ టెలివిజన్ నటి, వాణి భోజన్ మాట్లాడుతూ… శరీరానికి అవసరమైన పోషకాహారంలో కొంత భాగాన్ని పొందేలా బాదం చేస్తుందన్నారు. మీ ఆరోగ్యంపై ఎక్కువగా రాజీ పడకుండా పండుగ సీజన్‌లో గొప్ప ఆహారాన్ని ఆస్వాదించవచ్చని నిర్ధారిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement