Monday, May 20, 2024

Twit – ఈ ఆరు గ్యారంటీలు చూసి ఓటు వేయండి – కేటీఆర్

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక ట్విట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లపై సెటైర్లు విసురుతూ… ఆసక్తి కర కామెంట్ చేశారు..

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు గాలికొదిలేసారని… అందుకే ఈ 6 గ్యారంటీలను గుర్తించుకొని ఓటు వేయాలని కోరారు.అందులో ఇన్వర్టర్, చార్జింగ్ బల్బ్స్, టార్చ్ లైట్లు, క్యాండిల్లు, జనరేటర్లు మరియు పవర్ బ్యాంకులను గుర్తుపెట్టుకుని… ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరారు కేటీఆర్.

అయితే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత నీళ్ల సమస్యలు అలాగే కరెంటు సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ అంశాలను తెరపైకి తీసుకువచ్చేందుకు కేటీఆర్ ఇలా సెటైరికల్ కామెంట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement