Thursday, May 2, 2024

Suspence: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ నేడే.. టీ20లో అసలైన పోరు..

T20 World Cup 2021: నరాలు తెగే ఉత్కంఠ.. క్షణక్షణం తారుమార‌య్యే ఆధిపత్యం.. మునివేళ్లపై నిలబెట్టే హైటెన్షన్! ఇవీ.. భారత్-పాక్ పోరులో ఎదురయ్యే రెగ్యులర్ భావోద్వేగాలు.!

అలాంటిది టీ20 ప్రపంచకప్‌లో ఇరు దేశాలు తలపడితే? అది కూడా చాలా సంవత్సరాల తర్వాత మ్యాచ్ జరిగితే? ఇంకేమ‌న్నా ఉందా.. క్రికెట్ ప్రేమికుల‌కు అస‌లైన క‌నువిందు ఈ రోజు జ‌ర‌గ‌నుంది. దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ఈ పోరుపై క్రికెట్ ఫ్యాన్స్‌ అంతే ఇంట్ర‌స్ట్ గా ఎదరుచూస్తున్నారు.

ప్రపంచ క్రికెట్ హిస్టరీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కి ఉన్న స్థానమే వేరు. ప్రపంచకప్‌ సిరీస్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పుడు త‌ల‌ప‌డ్డా అభిమానులకు వ‌చ్చే కిక్ మాటల్లో చెప్పడం కష్టమే!

ఇదంతా ఒకెత్తయితే ఈమ‌ధ్య కాలంలో ఇండో-పాక్ బోర్డర్ ఉద్రిక్తతలతో ఇరు దేశాల మధ్య‌ హైటెన్షన్ నెలకొంది. ఇదే సమయంలో దాయాదుల పోరుకు పొలిటికల్ సెగలు కూడా తగిలాయి. టెర్రర్ పాక్‌తో ఆటలు అవసరమా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌తో జరగబోయే ఫస్ట్ ఫైట్ అమాంతం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement