Sunday, April 28, 2024

SRH vs CSK – సిఎస్కేను కట్టడి చేసిన సన్ రైజర్స్ .. టార్గెట్ ఎంతంటే

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతోంది ..ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ టార్గెట్ 166పరుగులుగా నిలిచింది.

వారం క్రితం ఐపీఎల్ రికార్డు స్కోర్ బ‌ద్ధ‌లైన చోట స్టార్ల‌తో నిండిన చెన్నైని నిలువ‌రించారు. డేంజ‌ర‌స్ శివం దూబే(45), అజింక్యా ర‌హానే(35)లు బౌండ‌రీల‌తో చెల‌రేగినా చెన్నైని త‌క్కువ స్కోర్‌కే ప‌రిమితం చేశారు..

క‌మిన్స్ సార‌థ్యంలోని పేస్ ద‌ళం వ‌రుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచినా…చివ‌ర్లో ర‌వీంద్ర జడేజా(31 నాటౌట్) దంచాడు. దాంతో, సీఎస్కే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 165 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లలో క‌మిన్స్, న‌ట‌రాజ‌న్, ఉనాద్క‌ట్‌, భువ‌నేశ్వ‌ర్‌లు త‌లా ఒక‌ వికెట్ ప‌డ‌గొట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement