Tuesday, April 30, 2024

Siricilla – ఇక ఆగదే లే, గద్దల వాలి పోరాటం చేస్తాం – కెసీఆర్

50 వేల మంది రైతులతో పెళ్లి మేడిగడ్డలో నీటి పారకం సృష్టిస్తాం

  • కెసిఆర్ ఇక ఆగడు, గద్దల వాలి పోరాటం చేస్తాం
  • నాలుగు నెలలకే తెలంగాణను ఎడారిగా మార్చారు
  • హామీలను ఎగవేసి ప్రజల్ని మోసం చేశారు.సిరిసిల్ల మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

సిరిసిల్ల, ఏప్రిల్ 5 (ప్రభన్యూస్) : తెలంగాణ వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకపోయిందని చేతకాని ప్రభుత్వం, చవట దద్దమ్మల పాలకల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలకు ఎగనామాలు పెట్టి మోసాలకు గురిచేశారని భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోపించారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పర్యటించిన కేసీఆర్ చివరగా సాయంత్రం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇది మనిషి సృష్టించిన కరువు అని, చేతగాని, తెలివి లేని, చవట పాలకుల వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభానికి గురికావడంలో ఎవరు జవాబుదారీగా ఉంటారని ప్రశ్నించారు. పదేళ్లుగా సుభిక్షంగా ఉండి ఎర్రటి ఎండల్లో సైతం గోదావరి జలాలను పారించిన తెలంగాణలో 2014 కు ముందు ఉన్న పాత కథ మళ్ళీ పునరావృతం అయిందన్నారు. కెసిఆర్ ను బదనాం చేయాలనే కుట్రతో మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లపై రాద్ధాంతం చేస్తున్నారని నిజానికి మేడిగడ్డ అవసరం లేకుండానే నీరు పంటలకు ఉపయోగించవచ్చని, పంపులు నడవకుండా కుట్ర చేశారని నదుల్లో పిల్లర్ల కింద ఇసుక కొట్టుకపోవడం సాధారణమని, దానిపై పిచ్చి విఫల ప్రయత్నం చేశారే తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు.

మేడిగడ్డలో నీరు నింపకపోయిన పక్షంలో 50 వేల మంది రైతులను తీసుకెళ్లి నీటి ప్రవాహం సృష్టిస్తానని దీనితో మళ్లీ మిడ్ మానేరు వరకు రిజర్వాయర్లన్నీ కళకళలాడుతాయన్నారు. ఇందు కోసం తాను అక్కడే కుర్చి వేసుకొని కూర్చుంటానని, కాదంటే తొక్కి పండబెడతామని కెసిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, నాలుగు నెలలు ఓపిక పట్టామని, ఇక కేసీఆర్ ఆగడని గద్ద లెక్క వాలుతాడని, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేస్తామని, ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాతో ప్రజల పక్షాన నిలబడి వారికి పూర్తి న్యాయం జరిగేలా చేస్తామన్నారు.

ఉమ్మడి జిల్లాకు ఎలాంటి డోకా లేకుండా నాలుగు సజీవ జలధారలు సృష్టించామని వాటిని ప్రజలు చూశారని, ఫలితాలను అనుభవించారన్నారు. గోదావరి జలాలతో అప్పర్ మానేరు నిర్మాణo వరకు నిరంతరం నీటితో కలకల లాడింది అన్నారు. దశాబ్దాల తరబడి వరద కాలువలో ఒకటిన్నర టిఎంసిల నీటితో ఏడాది పొడవునా చూశారని, కాకతీయ కాలువ 9, 10 నెలలు జలాలతో కలకలలాడుతూ పారేదన్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా లక్ష టన్నుల ధాన్యం పంటలు, పుష్కలంగా మంచినీటి సరఫరా జరిగిందన్నారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నాలుగు నెలల పాలనలోనే ఎడారులుగా మార్చారన్నారు. సముద్రంలా ఉండే మిడ్ మానేరు ఎండ పెట్టారని దానితో మునిగిన ఊర్లన్నీ పైకి తేలాయని ఈ ప్రాంతమంతా స్మశానoగా మారిందన్నారు. లోయర్ మానేరు డ్యాం నిరంతరం పుష్కలమైన నీటితో ఎంతో అద్భుతంగా ఉండేదని కానీ నేడు కరీంనగర్లో రోజు నీటి సరఫరా జరుగగా, ఇప్పుడు దినం తప్పించి దినం నీటి సరఫరా వస్తుందని ప్రభుత్వం తెలివి తక్కువ వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 2014 కు ముందు పడిన గోస నీటి ట్యాంకర్ల తో సరఫరా, రోడ్లపై ఖాళీ బిందెలతో, కాలిన మోటార్లతో కనిపించేవని ఆ సీను మళ్లీ పునరావృతం అవుతుందన్నారు.

అడ్డగోలు హామీలతో, అన్ని మోసాలతో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. నేడు పంటలు ఎండని జిల్లా లేదని, కరెంటు రాని కాలిపోని మోటార్లు లేని జిల్లా లేదన్నారు. పాత తెలంగాణ పునరావృతం అయిందని, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు చూస్తున్నారని కేసీఆర్ పెద్దవా చేశారు. నీటి నిలువ సామర్థ్యం, నిర్వహణ విధానం తెలియని అసమర్ధ చవట దద్దమ్మల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు

. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు వల్ల వచ్చింది అన్నారు. సాకులు చెప్పి కాంగ్రెస్ పాలకులు తప్పించుకోలేరు నిజానికి రాళ్ల వర్షం వల్ల లక్ష ఎకరాలు మాత్రమే నష్టం జరిగిందని నీరంధక 15 నుండి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, నీటి సామర్థ్యం లేక ఎలా నీటిని నిర్వహించాలో తెలియక ప్రభుత్వ వైఫల్యం వల్ల పంటలు ఎండాయి. అసమర్ధ మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలేనని తక్కువ వర్షపాతం వల్ల పంటలు ఎండాయని అనడం సరికాదన్నారు. కొన్ని జిల్లాలలో ఎక్కువ వర్షపాతం కూడా పడిందని ఇందులో వీరి వైఫల్యం అసమర్ధలే కారణమన్నారు. రైతుబంధు ఆపారని, ఒకటి, రెండు, మూడు ఎకరాలతో రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారని అయినప్పటికీ ఇంకా పూర్తి పంపిణీ కాలేదని ఇదో ప్రభుత్వ వైఫల్యం అన్నారు. 200 మంది రైతులు చనిపోతే జాబితా ఇస్తే 48 గంటల్లో పరిహారం ఇస్తానన్న సీఎం, చీఫ్ సెక్రటరీకి నాలుగు గంటల్లోనే జాబితా ఇచ్చిన ఇంతవరకు ఉలుకు లేదన్నారు. వీరికి 25 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల ఉసురు పాపం తగులుతుందని హెచ్చరించారు.

రైతులకు పెట్టుబడిపోయింది పంటలు పోయాయి ఇది జాతీయ విపత్తు కంటే ఎక్కువ అని ఎకరానికి 25 వేల పంట నష్టం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు వీపు విమానం మోత మోగిస్తారని హెచ్చరించారు. రిజర్వాయర్లలో నీటి నిలువ ఉన్నప్పటికీ నెల రోజులుగా పంటలకు నీరు ఇవ్వకుండా ఎండబెట్టారన్నారు. వనరులు ఎలా వినియోగించుకోవాలో వాడుకునే తెలివి లేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 కే చేస్తామని చెప్పారని బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారని దీనిపై ఉలుకు పలుకు లేదని వెంటనే వీరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలు కొంటామని చెప్పి జొన్నలు కొనడం వీలుకాదని అంటున్నారని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతున్నందున రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని దీనిని ఎన్నికల కమిషన్ అడ్డుకోదని, రైతులు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారని ఇవ్వకుంటే కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.

తాము అమలు చేస్తున్న అన్ని పథకాలను నిలిపివేశారని కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య పెన్షన్లు, గొర్రెల పథకం, పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బందు చేశారని స్కాలర్షిప్లు నిలిపివేశారని మేము మంజూరు చేసిన రైతుబంధు నిలిపివేశారని ఆరోపించారు. వృద్ధాప్య పెన్షన్లు 4000 ఇస్తామని ఎగనామం పెట్టారని, నాలుగు నెలలుగా ప్రతివృద్ధునికి రూ. 24 వేల పెన్షన్ ఎగనామం పెట్టారని వాటిని వెంటనే ఇవ్వాలన్నారు.

హైదరాబాదులో నీటి ట్యాంకర్లు ఉచితంగా సరఫరా చేసి ప్రజలపై ప్రేమ నిరూపించుకోవాలన్నారు. ఇచ్చిన హామీలలో ఎకరానికి అదనంగా రూ. 500 బోనస్, 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 2500 సాయం మొదలైన డిమాండ్లన్నీ అమలు చేయాలని, ప్రజలు రెఫరండంగా ఎగవేతలను తీసుకొని తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హామీలు అమలు చేయని పక్షంలో ప్రజలు కర్రు కాల్చి రాతలు పెడతారని వారి వెంట ఉండి తాము పోరాడుతామని కెసిఆర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement