Friday, April 26, 2024

ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. మలేషియన్‌ బౌలర్‌ ఘనత

నేపాల్‌ ప్రో క్లబ్‌ ఛాంపియన్‌షిప్‌లో మలేషియా నైన్‌ బౌలర్‌ విరన్‌దీప్‌ సింగ్‌ అరుదైన ఘనత సాధించాడు. పుష్‌ స్పోర్ట్స్ ఢిల్లి, మలేషియా నైన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సింగ్‌.. ఆఖరి ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఓ హ్యాట్రిక్‌తో పాటు ఓ రనౌట్‌ ఉంది. 19వ ఓవర్‌ వరకు 131/3 స్కోర్‌తో పటిష్టంగా ఉన్న పుష్‌ స్పోర్ట్స్ ఢిల్లి జట్టు.. విరన్‌ దీప్‌ బౌలింగ్‌కు 132/9కు పరిమితమైంది. 1951లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. హంటర్‌ కప్‌ దీనికి వేదికైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మలేషియా నైన్‌ 17.3 ఓవర్స్‌లో మూడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement