Friday, April 19, 2024

టెట్‌కు 6.29 లక్షల దరఖాస్తులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టెట్‌కు మొత్తం 6,29,352 దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం సాయంత్రం వరకు 6,26,928 దరఖాస్తులు రాగా, అర్థరాత్రి వరకు మరో 3వేల దరఖాస్తులు పెరిగాయి. ఈమేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ వివరాలను ప్రకటించారు. ఇందులో పేపర్‌-1కు 3,51,468, పేపర్‌-2కు 2,77,884 దరఖాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే టెట్‌ దరఖాస్తుల్లో తప్పులు దొర్లిన అభ్యర్థులకు ఎడిట్‌ చేసుకునేందుకు ఆప్షన్‌ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్‌ బీఎడ్‌ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement