Sunday, May 26, 2024

కోహ్లీని కనీసం గౌరవించండి, విరాట్‌ ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ ప్లేయర్ : షోయబ్‌ అక్తర్‌..

టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి పాకిస్తాన్‌ మాజీ మాజీ షోయబ్‌ అక్తర్‌ అండగా నిలిచాడు. కోహ్లీపై విమర్శలు ఆపాలని కోరాడు. విరాట్‌ కోహ్లీ దిగ్గజ క్రికెటర్‌ అని, అతనికి కనీస గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో కోహ్లీ విఫలం అయ్యాడని, కానీ ముందు మ్యాచ్‌లు, రికార్డులు చూసుకోవాలన్నారు. విరాట్‌ వైఫల్యంపై మాజీ క్రికెటర్లు సెహ్వాగ్‌, డానియెల్‌ వెటోరి, ఇయాన్‌ బిషప్‌లు చేసిన కామెంట్లకు అక్తర్‌ గట్టి జవాబిచ్చాడు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో.. చిన్న పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటారన్నారు. దిగ్గజ ఆటగాళ్లే ఇలా విమర్శిస్తుంటే.. యువ ఆటగాళ్ల ముందు విరాట్‌ చులకన అయిపోతాడని తెలిపాడు.

విరాట్‌ ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ ప్లేయర్‌ అని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ 110 సెంచరీలు చేయాలని కోరుకుంటున్నట్టు వివరించాడు. 45 ఏళ్ల వరకు కోహ్లీ క్రికెట్‌ ఆడాలన్నారు. ఓ పాకిస్తానీగా చెబుతున్నా అంటూ అక్తర్‌ చెప్పుకొచ్చాడు. ఈ కఠిన పరిస్థితులను చూసి.. ఆందోళన పడాల్సిన అవసరం లేదని కోహ్లీకి సూచించాడు. ఇలాంటి పరిస్థితులే మనిషిని మరింత బలంగా తయారు చేస్తాయన్నారు. ఏ విషయంపై ట్వీట్‌ చేసినా.. నెగిటివ్‌గానే తీసుకుంటారని, సతీమణి, కూతురు గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడుతారని తెలిపాడు. ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొని కోహ్లీ అంటే ఏంటో సత్తా చూపించాలని కోరాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement