Monday, April 29, 2024

ఏఐఎఫ్‌ఎఫ్‌ నుంచి కో ఆప్షన్‌ సభ్యులను నియమించండి..

ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ నుంచి కో ఆప్టెడ్‌ సభ్యులుగా నియమించాలని ఫిఫా, ఏఎఫ్‌సిలు కోరాయి. ప్రస్తుతం ఎన్నుకోబడిన సభ్యులుగా ఉన్న క్రీడాకారులే కాకుండా కో ఆప్టెడ్‌గా ఉండాలని కోరింది. దీంతో క్రీడాకారుల అభిప్రాయాలను పంచుకోవడానికి వీలవుతుందన్నారు. నిబంధనల ప్రకారం క్రీడాకారుల ప్రాముఖ్యతను కోల్పోకూడాదని పేర్కొంది. ముసాయిదా చట్టాల ప్రకారం 35 మంది ప్రముఖ క్రీడాకారులతోపాటు అదనంగా మరో 35 మంది అసోసియేట్‌గా ఉంటారన్నారు. ఇందులో ఫిఫా నిబందనల ప్రకారం ఎవరూ అణచివేతకు గురికావాల్సిన అవసరం ఉండదన్నారు.

35 మందితో ఏఐఎఫ్‌ఎఫ్‌ (ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌)లో గవర్నెంగ్‌ బాడీని ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కాదని ఫిఫా, ఏఫ్‌సి అభిప్రాయ పడింది. 50 ఉన్న సభ్యులు ఉన్నప్పటికీ 25శాతం కోప్షన్‌ సభ్యులుగా నియమించడం మంచి ఆలోచనగా ఫిఫా అభివర్ణించింది. 50శాతం సభ్యులకు సభ్యత్వం ఇవ్వడం కంటే 25శాతం కంటే ఎక్కువ మందిని జాతీయ క్రీడా నిబంధనలకు అనుగుణంగా కోప్టెడ్‌ సభ్యులుగా నియమించుకోవచ్చని తెలిపింది. దీనిపై స్థానిక ఫుట్‌బాల్‌ క్రీడాకారుల అభిప్రాయాలను కూడా తీసుకొని సుప్రీంకోర్టు ఏఐఎఫ్‌ఎఫ్‌కు సవరణలు ఇచ్చే అవకాశముందని కూడా ఫిఫా, ఏఎఫ్‌సి తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement