Monday, May 6, 2024

ఆర్ సి సూప‌ర్ బ్యాటింగ్ – ల‌క్నో జెయింట్స్ టార్గెల్ 213 ప‌రుగులు

బెంగుళూరు – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన మ్యాచ్ ల్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాట‌ర్లు దంచి కొట్టారు. ఓపెన‌ర్లు ఫాఫ్ డూప్లెసిస్(78), విరాట్ కోహ్లీ(61), గ్లెన్ మ్యాక్స్‌వెల్(59) హాఫ్ సెంచరీల‌తో చెలరేగారు. దీంతో నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో , రెండు వికెట్ల‌ న‌ష్టానికి 212 ర‌న్స్ చేసింది. మార్క్ వుడ్ వేసిన 20వ ఓవ‌ర్‌లో నాలుగో బంతికి మ్యాక్స్‌వెల్ సిక్స్ కొట్టాడు. ఆ త‌ర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. డూప్లెసిస్, మ్యాక్స్ వెల్ లు రెండో వికెట్‌కు 115 ర‌న్స్ జోడించారు. కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ 79 నాటౌట్: 46 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 61: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 59: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుతో అర్థ సెంచరీలు సాధించారు. ల‌క్నో బౌలర్ల‌లో మార్క్ వుడ్ , అమిత్ మిశ్రాలు ఒక్కో వికెట్ తీశాడు. 213 ప‌రుగుల విజ‌య‌లక్ష్యంతో ల‌క్నో బ్యాటింగ్ కు దిగ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement