Monday, April 29, 2024

నీల్ సినిమా ప్రారంభించే ముందు మరో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్న ఎన్టీఆర్

దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్30 సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ని ఎన్టీఆర్ ఇటీవలే పూర్తి చేశారు. ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ పాత్రలో కనిపిచనున్నట్టు తెలుస్తోంది. ఇక, వచ్చే ఏడాది మొదట్లో ‘కెజిఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో కొత్త సినిమాని ప్రారంభించనున్నారు. అయితే, నీల్ ప్రాజెక్ట్‌ను చేపట్టేలోపు ఎన్టీఆర్ మరో మూవీని పూర్తి చేయనున్నట్టు సినీ వర్గాల సమాచారం.

ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ‘వార్ 2’లో అడుగుపెడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఎన్టీఆర్ మరో లీడ్‌లో కనిపించనున్నాడు, అయితే ఈసారి నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ ప్రొడక్షన్ నవంబర్ లేదా డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా, ప్రశాంత్ నీల్ సినిమా పనిని ప్రారంభించే ముందు ఎన్టీఆర్ “వార్ 2” షూటింగ్ ని ప్రారంభిస్తాడు. ‘సాలార్’ రిలీజ్ తర్వాత, నీల్‌కి ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ రాయడానికి కూడా సమయం కావాలి. కాబట్టి, ఇది ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరికీ బాగా పని చేస్తుందపి బావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement