Saturday, April 27, 2024

Sports: ఆసియా గేమ్స్‌ వాయిదా, 2023లోనే నిర్వహణ.. చైనాలో కరోనా వ్యాప్తే కారణం

సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా గేమ్స్‌ను 2023కు వాయిదా వేస్తున్నట్టు ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా (ఏసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్‌ సింగ్‌ శుక్రవారం వెల్లడించారు. ఈసారి ఆసియా గేమ్స్‌ షాంఘైకి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెజియాంగ్‌ ప్రావిన్స్‌ రాజధాని హంగ్‌జౌ నగరంలో సెప్టెంబర్‌ 10 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నాయి. 15 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో కరోనా కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తున్నది. అయితే ఇంత ఆకస్మికంగా ఆసియా గేమ్స్‌ వాయిదా వేసేందుకు గల కారణాలు మాత్రం నిర్వాహకులు అధికారికంగా వెల్లడించలేదు. కరోనా వ్యాప్తి కారణంగా షాంఘై నగరం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కట్టడి చేయడానికి చైనా అధికారులు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నాల్గో వేవ్‌ కారణంగా టోర్నీ నిర్వహణతో పాటు ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళనతో ఈ టోర్నీని నిర్వాహకులు వాయిదా వేసినట్టు తెలుస్తున్నది.
రెండో అతిపెద్ద క్రీడలు
వివిధ రకాల క్రీడలను నిర్వహించే ఈ మెగా టోర్నీ 19వ ఎడిషన్‌ సెప్టెంబర్‌లో నిర్వహించాలని తొలుత భావించారు. ఇక సమ్మర్‌ ఒలింపిక్స్‌ గేమ్స్‌ లాంటి టోర్నీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీ కాగా.. ఒలింపిక్స్‌తో పోల్చితే ఆసియా గేమ్స్‌ రెండో అతిపెద్ద మెగా టోర్నీగా భావిస్తుంటారు. ఆసియా గేమ్స్‌ను ప్రతీ నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ టోర్నీలో ఆసియా ఖండంలోని దేశాల క్రీడాకారులు, అథ్లెట్లు పాల్గొంటారు. ఇది మల్టిd స్పోర్‌ ్ట ్స ఈవెంట్‌. ఢిల్లిdలో తొలి ఆసియా గేమ్‌ను ప్రారంభించారు. 1978 వరకు ఆసియన్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఈ టోర్నీ నిర్వహించేది. 1982 నుంచి ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్నది. ఈ క్రీడలను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ గుర్తించింది. ఇప్పటి వరకు ఆసియా క్రీడలకు 9 దేశాలు అతిథ్యం ఇచ్చాయి. 46 దేశాల నుంచి క్రీడాకార్లు, అథ్లెట్లు పాల్గొంటారు. గత క్రీడలు ఇండోనేషియాలోని జకార్తాలో జరిగాయి. ఆ తరువాత ఆసియా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగాల్సి ఉండగా.. 2023కు వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement