Wednesday, May 1, 2024

IPL MATCH : ముంబై ఓడితే….ఆర్సీబితో నేడు నాకౌట్ మ్యాచ్..

ఐపీఎల్ లో ఎవరెవరు ఎదురుపడకూడదో, వారే ఎదురవుతున్నారు. రెండు సింహాలు.. కొదమ సింహాల్లా మారి ఆడితే ఎలా ఉంటుందో, నేడు మ్యాచ్ అలాగే ఉంటుంది. ఆ రెండు సింహాలు ఎవరో కాదు, ఒకరు ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ అయితే, మరొకరు ఆర్సీబీ నుంచి విరాట్ కొహ్లీ.. వీరిద్దరూ ఎదురెదురుగా ఆడితే అభిమానులకు పండగే పండగలా ఉంటుంది.

- Advertisement -

రెండు జ‌ట్ల‌కు అగ్నిప‌రీక్షే…
నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ముంబై వాంఖేడీ స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య ఒక సారూప్యత ఉంది. అదేమిటంటే రెండు జట్లు కూడా ఒకొక్క మ్యాచ్ మాత్రమే ఇప్పటి వరకు గెలిచాయి. ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్ లు ఆడి మూడు ఓడిపోయి, ఒకటి గెలిచింది. ఆర్సీబీ అయితే ఐదు మ్యాచ్ లు ఆడి 4 ఓడి, ఒకటి గెలిచింది.

ఇప్పుడు రెండు జట్లకి గెలవక తప్పని మ్యాచ్ ఇది…ఎందుకంటే ఇప్పటికే పాయింట్ల టేబుల్ లో రెండు జట్లు ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. 8వ స్థానంలో ముంబై ఉంటే, 9వ స్థానంలో ఆర్సీబీ ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మాత్రమే టోర్నీలో కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా నెలకొనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు జట్లు ఈ మ్యాచ్లో చాలా ఉత్కంఠ భరితంగా కష్టపడి ఆడాల్సి ఉంటుంది. ఇక టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 34 మ్యాచ్ లు జరిగితే ముంబై 20 సార్లు గెలిస్తే, ఆర్సీబీ 14 సార్లు విజయం సాధించింది.

రోహిత్ ,కోహ్లీలు ఆడితేనే…
ఏదేమైనా ముంబై నుంచి రోహిత్ శర్మ ఆడాలి. అలాగే ఎన్నో అంచనాలతో వచ్చిన సూర్యకుమార్ తొలి మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆడుదాం, చూద్దామంటే మ్యాచ్ లు లేవు. టేబుల్ లో టాప్ ఫోర్ ప్లేసెస్ ఫుల్ అయిపోతున్నాయి. వీరెక్కడో 8వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ నుంచి ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి ఈ మ్యాచ్ అగ్నిపరీక్షలా మారనుంది.

ఇక ఆర్సీబీ విషయానికి వస్తే, వీరి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విజయ్ మాల్యా చేతుల్లో ఉంది. కాకపోతే తను ఆర్థిక నేరాలకు పాల్పడటంతో దేశం దాటి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అది ఓనర్ లేకుండానే నడుస్తోంది. అందువల్లే వీళ్లిలా ఆడుతున్నారేమో తెలీదు. ప్రస్తుతం కొహ్లీ ఒక్కడే బండి లాగుతున్నాడు. ఈసారేం చేస్తాడో చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement