Wednesday, May 22, 2024

Jammu Kashmir: అనంత‌నాగ్ లోక్ సభ పోలింగ్ వాయిదా…

వ‌ర్షాలు, హిమ‌పాతంతో ఇబ్బందులు
వాస్తవానికి మే 7న అక్క‌డ పోలింగ్
ర‌వాణా వ్య‌వ‌స్థ బంద్ కావ‌డంతో
మే 25వ తేదీకి మార్చిన ఎన్నిక‌ల క‌మిష‌న్

జ‌మ్మూక‌శ్మీర్ లో ఒక వైపు వ‌ర్షాలు, మ‌రో వైపు హిమ‌పాతం… దీంతో ఆక్క‌డ జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థంగా మారింది.. చాలా ప్రాంతాల‌కు ర‌వాణా సౌక‌ర్యాలు సైతం బంద్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో అనంత్‌నాగ్‌- రాజౌరీ లోక్‌సభ స్థానంలో ఎలక్షన్స్ ను మే 25వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయించింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఎన్నికల తేదీ మినహా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, తొలుత ఈసీ ప్రకటించిన తేదీ ప్రకారమైతే మే 7న అక్కడ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా 20 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, ఈసీ నిర్ణయాన్ని పీడీపీ పార్టీ తప్పుబట్టింది. అయితే, ప్రజా ప్రాతినిథ్య చట్టం-1951లో సెక్షన్‌-56 కింద పోలింగ్‌ తేదీని మే 7వ తేదీ నుంచి 25కు మార్చినట్టు ఎన్నికల కమిషన్ చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement