Saturday, May 4, 2024

Olympics : తొలిసారి ఒలింపిక్స్‌ లో న‌గ‌దు ప్రైజ్… విజేత‌కు రూ.41 లక్ష‌లు

ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకాలు సాధించే క్రీడాకారులకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో 48 విభాగాల్లో ప్రైజ్మనీ అందించనున్నట్టు వెల్లడించింది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ నుంచి స్వర్ణంతో పాటు రజత, కాంస్య పతక విజేతలకు నగదు బహుమతులు ఇస్తామని డబ్ల్యూఏ పేర్కొంది.

- Advertisement -

”ఒలింపిక్స్‌లో నగదు బహుమతి అందజేసే మొదటి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ నిలుస్తుంది. అత్యున్నత క్రీడల్లో బంగారు పతకాలు సాధించే క్రీడాకారులకు పారిస్ ఒలింపిక్స్ నుంచి ప్రైజ్మనీ అందజేస్తాం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆదాయంలో వాటా కింద ప్రతి నాలుగేండ్లకోసారి డబ్ల్యూఏ 2.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20 కోట్లు) అందుకుంటుంది. ఈ మొత్తాన్ని పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో 48 విభాగాల్లో స్వర్ణ ,ర‌జ‌త‌,కాంస్య పతకాలు గెలిచే క్రీడాకారులకు పంచుతాం. ఒక్కొక్కరికి 50,000 డాలర్లు (సుమారు రూ.41.60 లక్షలు) ప్రైజ్మనీగా ఇస్తాం” అని డబ్ల్యూఏ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement