Sunday, May 5, 2024

మిచెల్ మార్ష్ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్..

ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ గ్రెటా మాక్‌తో ఎంగేజ్ మెంట్ జ‌రిగింది. త‌న వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ ఉన్న ఫొటోను మార్ష్ రిలీజ్ చేశాడు. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా టీమ్‌లో మార్ష్ కూడా ఉన్నాడు. టోర్నీ ఆరంభానికి స‌రిగ్గా నెల రోజుల ముందు మార్ష్ ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌డం విశేషం. త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మార్ష్ ఎంగేజ్‌మెంట్ విష‌యాన్ని చెప్పాడు. ఏడాదిన్న‌ర కాలంగా మిచెల్ మార్ష్‌, గ్రెట్ మాక్ డేటింగ్‌లో ఉన్నారు. మిచెల్ మార్ష్ ఈ మ‌ధ్య కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప‌ర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. ఐదు టీ20ల సిరీస్‌లో 219 ప‌రుగులు చేయ‌డం విశేషం. అంతేకాదు 8 వికెట్లు కూడా తీశాడు. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్‌తో జ‌రిగిన ఐదు టీ20ల సిరీస్‌లోనూ మార్ష్ 156 ప‌రుగులు చేసి రాణించాడు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం: బండి సంజయ్

Advertisement

తాజా వార్తలు

Advertisement