Monday, April 29, 2024

బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి: హరీశ్ రావు

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో రైతులపై భారం పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు ఉసురు పోసుకుంటున్నదని విమర్శించారు. ఇక పాదయాత్రలు చేస్తున్న నేతలు.. రైతులు, ప్రజలపై ప్రేమ ఉంటే పెంచిన సిలిండర్ల ధర తగ్గించేందుకు కృషిచేయాలని, దానికోసం పాదయాత్రలు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడనైనా ఉన్నాయో చూపెట్టాలన్నారు. దేశంలో రైతులకు రూ.5 లక్షల బీమా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని, దొడ్డు వడ్లు కొనకుండా మొండికేస్తున్నదని విమర్శించారు.

ఇది కూడా చదవండి: యాదాద్రికి భక్తుల తాకిడి

Advertisement

తాజా వార్తలు

Advertisement