Saturday, April 27, 2024

అతనే టీం ఇండియా భవిష్యత్ కెప్టెన్ : గవాస్కర్

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొనున్నాడు. దీంతో యితే కోహ్లీ తర్వాత భారత పగ్గాలు ఎవరు చెప్పటనున్నారు అనే విషయం చర్చ జరుగుతుంది. కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మ టి20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికైతే సమస్య లేకపోయినప్పటికి రానున్న కాలంలో కెప్టెన్‌ సమస్య మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ వయసు 34 ఏళ్లు. ఫిట్‌నెస్‌ దృశ్యా రోహిత్‌  మహా అయితే ఇంకో రెండు మూడేళ్లు క్రికెట్‌ ఆడే అవకాశం ఉంది. కాబట్టి రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా బీసీసీఐ ఇప్పటినుంచే ఎవరని కెప్టెన్‌ చేయాలనే దానిపై అన్వేషణ సాగించాలి. ప్రస్తుత తరుణంలో కేఎల్‌ రాహుల్‌, శ్రెయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ లాంటి యువ ఆటగాళ్లు పరిమిత, టి20ల్లో కెప్టెన్‌గా రాణిస్తారని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని చూస్తే మాత్రం వీరి ముగ్గురిలో ఎవరో ఒకరిని త్వరలోనే చూడొచ్చు.

ఇక తాజాగా భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఈ విషయం పై స్పందిస్తూ… భారత కొత్త కెప్టెన్ గా ఓపెనర్ కేఎల్ రాహుల్ కనిపిస్తున్నాడు అని తెలిపాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మను కెప్టెన్ ను చేయాలనీ బీసీసీఐ చూస్తుందని.. కాబట్టి టీం ఇండియా వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ని నియమించాలని సూచించాడు. 34 ఏళ్ళ రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇప్పుడు అప్పగిస్తే బీసీసీఐ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని తెలిపాడు. కాబట్టి ఇప్పుడు రాహుల్ ను వైస్ కెప్టెన్ చేస్తే.. రాబోయే రోజుల్లో అతను కెప్టెన్ గా జట్టును సమర్ధవంతంగా నడపగలదని అన్నారు.

ఇది కూడా చదవండి: న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటన వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement