Tuesday, May 7, 2024

నితిన్ సరసన నిధి అగర్వాల్

సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ నిధి అగర్వాల్ వరస అవకాశాలను దక్కించుకుంటోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నితిన్ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.

నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రూపొందుతోంది. శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. మరో కథానాయికగా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. చూస్తుంటే తెలుగులో నిధి అగర్వాల్ జోరు పెరగనున్నట్టే అనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement