Sunday, May 19, 2024

దేవుని తీర్పు

విజ్ఞాన శాస్త్రం ఎక్కడ అంతమైపో తుందో, అక్కడ ఆధ్యాత్మికం మొద లవుతుంది . ఆధ్యాత్మికం విజ్ఞాన శాస్త్ర లెక్క లకు, కొలతలకు, ఋజువులకు, సిద్ధాంతా లకు అందదు. చిక్కదు. దొరకదు. ఆధ్యా త్మికం లెక్కల లోతులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. లోతుకు వెళ్ళిన కొద్ది లోతు ఎక్కువవుతుంటుంది. అంతా తెలిసినట్టే ఉంటుంది. తెలుస్తున్న కొలది తెలుసుకోవా ల్సింది చాలా ఉంది అనిపిస్తుంటుంది. అందుకనే ఏమో ”తెలిసేట్టు చెప్పేది సిద్ధాం తం. తెలియకపోతేనే అది వేదాంతం.” అన్నారు ఆచార్య ఆత్రేయ.
అవును. ఆధ్యాత్మికంలో ఎన్నో దారులు. ప్రతి దారికీ మరెన్నో మలుపులు. ఒక్కొక్క మలుపు, మరో మార్గానికి దారి చూపెడు తుంది. పిల్లదారులు చిన్న దారులు, ప్రతి చోట తారసపడుతుంటాయి. ఎటుపోతు న్నామో తెలీదు. గమ్యం చేరుతామో లేదో అనే అయోమయం. ఏమీ అర్ధంకాని స్థితి. ఏదో అర్ధం అయిపోతోంది అనే పరిస్థితి. గందరగోళంగా ఉంటుంది. గింగిర్లు పెట్టి స్తుంది. సాధకుడ్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగిస్తుంది.
దేవుడూ అంతే! దేవుడి లెక్కలు మన లెక్క కి భిన్నంగా ఉంటాయి. దేవుడు దేనిని దేనికి కలుపుతాడో, ఎందులోంచి ఎంత ఎప్పుడు ఎందుకు ఎలా తీసివేస్తాడో, దేనితో గుణి స్తాడో, ఎలా గణిస్తాడో, గణన చేస్తాడో ఓ పట్టా న అర్థంకాదు. దేవుని లెక్క దేవుని లెక్కే. దేవు ని లెక్క దివ్యంగా… నవ్యంగా… ధర్మంగా ఉంటుంది.
ఇద్దరు బాటసారులు ఓ ఊరి చివరన ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. కొంతసేపటికి మరో వ్యక్తి వచ్చి వారికి జత కలిసేడు. చీకటై పోయింది. ముగ్గురుకీ బాగా ఆకలవుతోంది. మూడో వ్యక్తి తినడానికి ఏమీ తెచ్చుకోలేదు. మొదటి వ్యక్తి దగ్గర అయిదు ఆపిల్‌ పళ్ళు ఉన్నాయి. రెండో వ్యక్తి దగ్గర మూడు పళ్ళు ఉన్నాయి. ఇద్దరూ మూడో వ్యక్తికి యిలా చెప్పారు. ”మా దగ్గర 8 పళ్ళున్నాయి. ఏం బాధపడకు. పళ్ళుని సమానంగా కోసుకుని ముగ్గురూ తిందాం.” అన్నారు. అమ్మయ్య అనుకున్నాడు మూడో వ్యక్తి.
ఒక్కొక్క పండునీ సమానంగా మూడు ముక్కలు కోసారు. మొత్తం 24 ముక్కల య్యాయి. ముగ్గురూ సమానంగా ఎనిమిదేసి ముక్కలు తిని పడుకున్నారు. తెల్లవారింది. రాత్రి తనని ఆదరించినందుకు తన దగ్గరున్న 8 రూపాయి నాణల్ని యిచ్చి, యిద్దరికీ కృత జ్ఞతలు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయా డు మూడో వ్యక్తి.
అప్పుడే అసలు కథ మొదలైంది. మూడో వ్యక్తి ఇచ్చిన 8 రూపాయిల్ని ఇద్దరూ తీసుకో వాలి. ఎలా పంచుకోవాలి? ఎవరు ఎంత తీసుకోవాలి? అనే సందేహం వచ్చింది.
”ఇద్దరి దగ్గరా ఉన్న పళ్ళని సమానంగా ముక్కలు కోసాము. ముగ్గురం సమానంగా తిన్నాం కాబట్టి, మూడవ వ్యక్తి ఇచ్చిన 8 రూపాయిల్ని సరి సమానంగా తీసుకుం దాం.” అన్నాడు 3 పళ్ళు యిచ్చిన వ్యక్తి.
”అదెలా కుదురుతుంది? అది సరికాదు. నేను 5 పళ్ళు యిచ్చేను కాబట్టి, ఇచ్చిన నిష్పత్తి లోనే రూపాయిల్ని పంచుకోవాలి.” అన్నాడు 5 పళ్ళు యిచ్చిన వ్యక్తి.
”ససేమిరా వీల్లేదు. ఆకలిని సమానంగా పంచుకున్నాం. ఆదాయాన్ని కూడా సమం గానే పంచుకోవాలి అన్నాడు.” 3 పళ్ళు ఇచ్చిన వ్యక్తి. ”నేను ఎక్కువ పళ్ళు యిచ్చేను. నేను ఎక్కువ తీసుకోవాలి. నేను ఐదు, నువ్వు మూడు తీసుకోవటం న్యాయం.” అన్నాడు 5 పళ్ళు ఇచ్చినతను.
ఎవరి వాదన వారిదే. వ్యవహారం ముదిరి వివాదంగా మారింది. ఇద్దరూ ఊరిపెద్ద దగ్గర కు వెళ్ళేరు. జరిగింది అంతా చెప్పారు. తమ దగ్గర వున్న డబ్బులు ఎలా పంచుకోవాలో చెప్పమన్నారు.
ఊరిపెద్ద ధర్మం ప్రకారం తీర్పు చెప్పే నైజం కలవాడు. ఇద్దరి వాదనా సబబే అనిపిస్తోంది. తొందరపడి తీర్పు చెప్పకూడదు అనుకొని, రేపు ఉదయం రండి ఆలోచించి చెబుతాను అని ఇద్దరినీ పంపివేశాడు. తీర్పు గురించి తీవ్రంగా ఆలోచిస్తూ , నడిరాత్రి అవుతుంటే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఊరిపెద్ద.
గాఢనిద్రలో వున్న ఊరిపెద్ద కలలో భగ వంతుడు కనిపించాడు. ”రేపు తీర్పు ఎలా చెప్పబోతున్నావు?” అని అడిగాడు దేవుడు. ఊరిపెద్ద దేవుడితో యిలా చెప్పాడు. ”5 పళ్ళు యిచ్చిన వ్యక్తిదే ధర్మం అనిపిస్తోంది. 5 పళ్ళు యిచ్చిన వ్యక్తి 5 రూపాయిలు, 3 పళ్ళు యిచ్చిన వ్యక్తి 3 రూపాయిలు తీసుకోవడమే ధర్మం. ఒకరు ఐదు, మరొకరు మూడు రూపా యిలు తీసుకోమని తీర్పు చెబుతాను.” అని చెప్పాడు.
ఆ మాటలు విన్న దేవుడు గొల్లున నవ్వాడు. తీర్పు తప్పుగా ఉందేమో ఆనే అనుమానం వచ్చిన ఊరిపెద్ద, తీర్పులో తప్పు ఉంటే చెప్ప మని దేవుడిని అడిగాడు. దేవుడు చెప్పటం మొదలు పెట్టాడు.
”అదేం తీర్పయ్యా? వాళ్ళిద్దరి వాదనా తప్పే. నీ తీర్పూ తప్పే. ఎలాగ తప్పో చెబుతా విను. తెచ్చిన 8 పళ్ళనూ సమానంగా కోసి, ముగ్గురూ సమానంగా తిన్నారు. అంటే ఒక్కొ క్కరూ ఎనిమిదేసి ముక్కలు తిన్నారు. 5 పళ్ళు తెచ్చిన వ్యక్తివి 15 ముక్కలు. రెండో వ్యక్తివి 9 ముక్కలు. అంటే తను తెచ్చిన వాటిలో ఏడు ముక్కలు త్యాగం చేసాడు మొదటి వ్యక్తి. రెం డో వ్యక్తి 8 ముక్కలు తినేసి ఒక ముక్కనే త్యా గం చేసాడు. ఇచ్చిన నిష్పత్తిలోనే వచ్చినవీ తీసుకోవాలి కదా! కాబట్టి మొదటి వ్యక్తి 7 రూపాయిలు, రెండో వ్యక్తి ఒక్క రూపాయి తీసుకోవాలి. అదీ ధర్మబద్ధం.” అని చెప్పి అంతర్ధానమయ్యేడు దేవుడు.
మెలకువ వచ్చిన ఊరిపెద్దకు దేవుడి చెప్పిన తీర్పు విలక్షణమైన దివ్యమైన తీర్పు అనిపిం చింది. మర్నాడు దేవుడు చెప్పినట్టే తీర్పు చెప్పాడు. అదీ… దేవుడి లెక్క . అలా ఉంటుం ది దేవుడి లెక్క. అందుకే అన్నారు. ”చేసుకున్న వారికి చేసుకున్నంత – ఇచ్చిన వారికి ఇచ్చినంత” అని. అదే దేవుని ప్రత్యేకత.

– రమాప్రసాద్‌ ఆదిభట్ల
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement