Wednesday, May 15, 2024

Indonesian Masters | భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న ప్రణయ్ !

ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రేపటి (జనవరి 23) నుంచి 28 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇండోనేషియాలోని జకార్తాలో జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీలో భార‌త్ త‌రుపున స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. అయితే మలేషియా సూపర్ 1000 & ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లలో బ్యాక్-టు-బ్యాక్ రన్నరప్‌గా నిలిచిన భార‌త డబుల్స్ స్టార్ జోడీ ఈ టోర్నీ నుంచి త‌ప్పుకున్నారు.

ఈ టోర్నమెంట్‌లో భార‌త స్టార్ ద్వ‌యం చిరాగ్ – సాత్విక్ గైర్హాజరీలో పురుషుల‌ డబుల్స్‌లో అర్జున్ – ధ్రువ్ కపిల భారత్ త‌రుపున‌ బరిలోకి దిగ‌నున్నారు. ఇక వారి ప్రారంభ రౌండ్‌లో మలేషియాకు చెందిన గోహ్ స్జె ఫీ మరియు నూర్ ఇజ్జుద్దీన్‌లతో తలపడ‌నున్నారు.

ఇకపోతే, ఫురుషుల సింగిల్స్‌లో.. భారత త‌రుపున ప్రణయ్ తో పాటు లక్ష్యసేన్, ప్రియాంషు రజావత్, కిదాంబి శ్రీకాంత్ ఉన్నారు. ప్రారంభ రౌండ్‌లో ప్రణయ్ తన మొదటి మ్యాచ్ సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూతో ఆడనున్నాడు. ఇతర భారత ఆటగాడు లక్ష్య సేన్ తన ప్రారంభ రౌండ్‌లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్‌తో తలపనున్నాడు. కిదాంబి శ్రీకాంత్ త‌న ప్రారంభ రౌండ్‌లో మలేషియాకు చెందిన లీ జియాతో ఆడనుండగా.. రజావత్ డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ జెమ్కేతో తలపడనున్నాడు.

అయితే, ఈ టోర్నీ మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లలో భారత్ త‌రుఫున ఎవ‌రూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement