Thursday, May 16, 2024

IND vs SL 2nd T20I:183/5 స్కోర్ చేసిన శ్రీలంక‌.. 184 ఛేజింగ్‌లో భార‌త్..

ధర్మశాల వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్ శ్రీలంక‌ రెండో T20Iలో శ్రీలంక 20 ఓవర్లలో 183/5 స్కోర్ చేసి భార‌త్ కు 184 టార్గెట్ ను సెట్ చేసింది. పాతుమ్ నిస్సాంక, దసున్ షనక డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ ఎదుర్కోని శ్రీలంక టీమ్ కు మంచి స్కోరు అందించారు. నిస్సాంక 75 పరుగుల వద్ద అవుట్ కాగా, షనక కేవలం 19 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో హర్షల్ పటేల్ బౌలింగ్ లో 23 పరుగులు చేసాడు షనక. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. మోద‌టి 7 ఓవర్లలో భారత బౌలర్లు వికెట్లేకుండా పోవడంతో.. 38 పరుగుల వద్ద దనుష్క గుణతిలకను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. చరిత్ అసలంకను రెండు పరుగుల వద్ద యుజ్వేంద్ర చాహల్ అవుట్ చేసాడు.. అయితే హర్షల్ పటేల్ కూడా కొంత సెప‌టికి త‌న అద్బుత బౌలింగ్ భ‌రతదేశం పోరాడటానికి సహాయం చేశాడు.

జనిత్ లియానాగే, జెఫ్రీ వాండర్సే స్థానంలో బినుర ఫెర్నాండో, దనుష్క గుణతిలకలను రిప్లేస్ చేసింది శ్రీలంక.. అయితే భార‌త్ మాత్రం టీమ్ లో ఎటువంటి మార్పులు లేకుండా మ్యాచ్‌లోకి దిగింది. తొలి టీ20లో శ్రీలంకపై 62 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. రోహిత్ శర్మ నాయకత్వంలో మరో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దాంతో టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ విజయం సాధించిన సంఖ్య 100కి చేరుకుంటుంది.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్(w), దసున్ షనక(c), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement