Saturday, May 11, 2024

Ind vs Eng, 2nd Test : టీ బ్రేక్.. ఇంగ్లండ్ స్కోర్ 155/4

విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్ జ‌ట్టు 396 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది.

అయితే రెండో రోజు ఆట‌లో భాగంగా టీ బ్రేక్ స‌మ‌యానికి ఇంగ్లండ్ జ‌ట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు జాక్ క్రాలే 76 పరుగులు, ఒల్లీ పోప్ 23 పరుగులు, బెన్ డక్కెట్ 21 పరుగులు చేసి ఔట్ కాగా, జానీ బెయిర్ స్టో 24 పరుగులు, బెన్ స్టోక్స్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement