Saturday, November 9, 2024

Dream11 – భార‌త జ‌ట్టుకు లీడింగ్ స్పాన్స‌ర్ గా డ్రీమ్ 11

ముంబై – ఫాంట‌సీ గేమింగ్ కంపెనీ డ్రీమ్‌11 – Dream11 భార‌తీయ క్రికెట్ జ‌ట్టుకు రానున్న మూడేళ్ల పాటు లీడింగ్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ది. బీసీసీఐ ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న నేడు విడుద‌ల‌ చేసింది. వెస్టిండీస్‌తో జ‌రిగే సిరీస్ నుంచి భార‌తీయ క్రికెట‌ర్ల జెర్సీల‌పై డ్రీమ్‌11 లోగో ఉండ‌నున్న‌ది. ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ 2023-25లో భాగంగా ఇండియా త‌న తొలి టెస్టు సిరీస్‌ను ఆడ‌నున్నది.

అయితే డ్రీమ్‌11తో జ‌రిగిన ఫైనాన్షియ‌ల్ ఒప్పందం గురించి బీసీసీఐ పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. బైజూస్ స్థానంలో డ్రీమ్‌11 స్పాన్స‌ర్ చేయ‌నున్న‌ది.. ఇక గ‌తంలో అఫిషియ‌ల్ స్పాన్స‌ర్‌గా ఉన్న డ్రీమ్‌11 ఇప్పుడు లీడింగ్ స్పాన్స‌ర్‌గా మారింది. ఇటీవల కిట్ స్పాన్స‌ర్‌గా అడిడాస్ కొన‌సాగ‌నుంది.. ఈ ఒప్పందం మార్చి 2028 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement