Thursday, May 16, 2024

కివీస్‌కి మరో షాక్‌… స్టార్‌ పేసర్‌ మాట్‌ హెన్రీ గాయంతో టోర్నీకి దూరం

వన్డే ప్రపంచకప్‌లో గాయాలతో సతమతమవుతున్న 2019 రన్నరప్‌ న్యూజిలాండ్‌కు మరో పెద్ద షాక్‌ తగిలింది. ఇప్పటికే కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమవగా.. ఇప్పుడు తాజాగా కివీస్‌ స్టార్‌ పేసర్‌ మాట్‌ హెన్రీ గాయంతో టోర్నీ మిగతా మ్యాచులకు దూరమయ్యాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ బౌలింగ్‌ చేస్తూండగా తొడ కండరాలు పట్టుకున్నాయి. దీంతో నొప్పితో విలవిలలాడిన హెన్రీ మ్యాచ్‌ మధ్యలోనే మైదానం వీడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో హెన్రీ ఐదు ఓవర్లే వేయగలిగాడు. మిగతా 5 ఓవర్ల కోటాను జెమ్మీ నీషమ్‌ పూర్తి చేశాడు.

తర్వాత బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ పరుగులు తీయడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో అతను ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను మిగతా మ్యాచుల్లో ఆడటం అనుమానమే. అతనికి కానీసం మూడు, నాలుగు వారాల విశ్రాంతి అవసరమని కివీస్‌ వైద్యబృందం వెల్లడించింది.

- Advertisement -

అయితే ఇప్పుడు మాట్‌ హెన్రీ స్థానాన్ని కైల్‌ జేమీసన్‌ భర్తీ చేస్తున్నాడు. కైల్‌ ఇప్పటికే కివీస్‌ జట్టులో వచ్చి చేరాడు. శనివారం (నేడు) పాకిస్తాన్‌తో న్యూజిలాండ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకి చాలా కీలకం. గెలిచే జట్టు సెమీస్‌ ఆశలు నిలుపుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement