Monday, May 13, 2024

ఎయిర్‌ రైఫిల్‌ చాంపియన్.. రోహిత్‌ కుమార్‌ సింగ్‌కు గోల్డ్‌ మెడల్‌

20వ కుమార్‌ సురేంద్ర సింగ్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో రోహిత్‌ కుమార్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శన కబరిచారు. స్వర్ణ పతకం పోటీలో మోహిత్‌ గౌడ్‌ను 17-13 తేడాతో రోహిత్‌ కుమార్‌ ఓడించి, అగ్రస్థానంలో నిలిచాడు. స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకోవడంతో కుమార్‌ సురేంద్ర సింగ్‌ షూటింగ్‌ చాంపియన్‌గా నిలిచాడు. హృదయ్‌ హజారికా 0.1 తేడాతో క్వాలిఫికేషన్‌ టాపర్‌ కిరణ్‌ జాదవ్‌ (633.5)పై గెలుపొంది రజత పతకం చేజిక్కించుకున్నాడు. జూనియర్‌ విభాగంలో హృదయ్‌పై 17-1తేడాతో మాజీ వరల్డ్‌ నం.1, ఒలింపియన్‌ దివ్యాన్ష్‌ సింగ్‌ పన్వర్‌ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. విజేండ్ల ప్రణీత్‌పై 17-11 తేడాతో అభినవ్‌ షాపై గెలుపొందాడు.

10మీ. ఎయిర్‌ రైఫిల్‌ (మెన్‌) ఫలితాలు పరిశీలిస్తే… రోహిత్‌ కుమార్‌ సింగ్‌ అగ్రస్థానంలో నిలవగా, మోహిత్‌ గౌడ్‌ ద్వితీయ, హృదయ్‌ హజారికా తృతీయ స్థానంలో నిలిచారు. జూనియర్స్‌ విభాగంలో దివ్యాన్స్‌ సింగ్‌ పన్వర్‌ తొలి స్థానంలో నిలవగా, హృదయ్‌ హజారికా, సుమేద్‌ ససనే వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. యూత్‌ విభాగంలో అభినవ్‌ షా మొదటి స్థానం, విజేండ్ల ప్రణీత్‌, ప్రణవ్‌ జిందాల్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. సబ్‌ యూత్‌ విభాగంలో ప్రణవ్‌ జిందాల్‌ తొలి స్థానంలో నిలవగా, అభినవ్‌ షా రెండో స్థానం, పార్థ మణ మూడో స్థానంలో నిలిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement