Friday, April 26, 2024

కరోనా ఎఫెక్ట్: టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ టోర్నీలను రద్దు చేసిన ఐసీసీ

కరోనా మహమ్మారి టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ప్రభావం చూపుతోంది. టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మూడు సబ్‌-రీజినల్‌ క్వాలిఫయర్‌ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు క్వాలిఫయర్లను రద్దు చేయడమే మంచిదని నిర్ణయించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీసీమెన్స్‌ టీ20 ప్రపంచకప్​ కోసం ఈ అర్హత టోర్నీలను నిర్వహిస్తున్నది.

కాగా మూడు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో ఎ, బి క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు ఫిన్‌లాండ్‌లో జరగనుండగా, వచ్చే రెండు నెలల్లో సి క్వాలిఫయర్స్‌కు బెల్జియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. వీటితో పాటు టీ20 వరల్డ్‌కప్‌​ అమెరికా క్వాలిఫయర్స్​, ఆసియా క్వాలిఫయర్స్​ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్​లో పాల్గొనే చివరి రెండు జట్లను ఈ టోర్నీ ద్వారా ఎంపికచేస్తారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన 2021 టీ20 ప్రపంచకప్‌ కరోనా కారణంగా యూఏఈలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దీనిపై బీసీసీఐ ఐసీసీని సంప్రదించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement