Saturday, April 27, 2024

బాలయ్య, గోపీచంద్ సినిమాకు టాప్ టెక్నీషియన్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సాంకేతిక నిపుణులు నటీనటుల ఎంపిక విషయంలో కూడా గోపీచంద్ కు నిర్మాతలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారట.

ఈ నేపథ్యంలోనే టాప్ టెక్నీషియన్స్ ని నటీనటులను సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడట గోపిచంద్. ఇక కథలో కీలకమైన 2 ఫీమేల్ లీడ్ రోల్స్ కోసమా ఇద్దరు స్టార్ హీరోయిన్లను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. గోపీ చంద్ గత చిత్రాల మాదిరిగానే ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుందట. ఇక ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement