Tuesday, May 14, 2024

పరువాల సోయగం.. వరుస హిట్లతో దూసుకెళ్తున్న సంయుక్త మీనన్​..

మలయాళ నటి సంయుక్తా మీనన్ 2016లో ‘పాప్‌కార్న్’ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. సూపర్ హిట్ చిత్రం తీవండిలో తనదైన నటనతో అందరి ప్రశంసలు పొందింది. 2021లో సంయుక్త వెల్లం అండ్​ ఆనుమ్ పెన్నుమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు కూడా అందుకుంది. దీంతో ఆమెను ఉత్తమ నటిగా సత్కరించారు. ఇక.. 2021లో సంయుక్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ భీమ్లా నాయక్‌ మూవీతో తెలుగులోనూ అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె రానా దగ్గుబాటి సరసన కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో ఆమె డైనమిక్ నటనకు ప్రశంసలు అందుకుంది.

ఇక.. 2022లో పృథ్వీరాజ్‌తో కడువ మూవీతో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న సంయుక్త ఇప్పుడు మరిన్ని సినిమాల్లో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. – ధనుష్ ద్విభాషా చిత్రం వాతి / SIR, కళ్యాణ్ రామ్ సినిమా బింబిసార, కన్నడలో గాలిపాట 2  వంటి సినిమాలు ఇప్పుడు అమ్మడి చేతిలో ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement